'తేజ్' కి అభిలాష సెంటిమెంట్..!

Tej I Love You Trailer ReleasedTej I Love You Trailer Released

'తేజ్' కి అభిలాష సెంటిమెంట్..! 

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. సోమ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మూవీ పి.ఆర్‌.ఒ లు బి.ఎ.రాజు, వంశీ కాక‌, నాయుడు, ఫ‌ణి, ఏలూరు శ్రీను, జిల్లా సురేశ్, ఆనంద్‌, దుడ్డి శీను అంద‌రి స‌మక్షంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ మొదటి చిత్రం 'అభిలాష' జర్నలిస్టుల సమక్షంలోనే ప్రారంభమైంది. సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ బాబు క్లాప్ తో, మరో సీనియర్ జర్నలిస్ట్ ఐ.అర్జునరావు కెమెరా స్విచ్ ఆన్ తో 'అభిలాష' ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్మాత కె.ఎస్.రామారావుకి జర్నలిస్టులతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం ట్రైలర్ ని పి.ఆర్.ఓ.ల సమక్షంలో విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో  `తేజ్ ఐ ల‌వ్ యు` కాంటెస్ట్ విజేత‌ల‌కు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, నిర్మాత కె.ఎస్‌.రామారావు బ‌హుమ‌తుల‌ను అందించారు.

ఇంద్ర ఫిలింస్ డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ మాట్లాడుతూ.. ట్రైల‌ర్ ఎక్స్‌టార్డిన‌రీగా ఉంది. సాయిధ‌ర‌మ్‌, క‌రుణాక‌ర‌ణ్‌ కాంబినేషన్ లో వ‌స్తోన్న ఈ సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది..అన్నారు.

రైట‌ర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ..ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. సినిమాలో ల‌వ్‌ఫీల్ ఉంది. క‌రుణాక‌ర‌న్‌గారికి మంచి హిట్ కావాలి. కె.ఎస్‌.రామారావుగారికి ఈ సినిమాతో బాగా డ‌బ్బులు రావాలి. నాకు డైలాగ్స్ రాసే అవ‌కాశం ఇచ్చిన రామారావుగారికి థాంక్స్‌. తేజ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. కెమెరామెన్ అండ్రూ విజువ‌ల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. గోపీసుంద‌ర్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఆల్ రెడీ పాట‌లు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సాంగ్స్ అన్ని హంటింగ్‌గా ఉన్నాయి. మా టీంకు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నాను.. అన్నారు.

కెమెరామెన్ అండ్రూ మాట్లాడుతూ..మూవీ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు.

నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ.. ఈ సినిమా టోట‌ల్ క్రెడిట్ అంతా సాయిధ‌ర‌మ్‌కే చెందుతుంది. అలాగే క‌రుణాక‌ర‌ణ్‌, అండ్రూ, గోపీసుంద‌ర్‌, డార్లింగ్ స్వామిల‌కు కూడా ద‌క్కుతుంది. నాకు తేజ్ డేట్స్ ఇచ్చి ఏడాదిన్న‌ర స‌మ‌యం వ‌ర‌కు మంచి క‌థ‌లు దొర‌క‌లేదు. ఆ స‌మ‌యంలో సాయిధ‌ర‌మ్ నాకు ఫోన్ చేసి నేనొక క‌థ విన్నాను. నాకు న‌చ్చింది. మీరు కూడా వినండి.. మీకు న‌చ్చితే సినిమా చేద్దాం అన్నారు. క‌రుణాక‌రన్ వ‌చ్చి క‌థ చెప్పాడు. నాకు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. క‌థ‌లో మంచి ఫీల్ ఉంది. యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని అనుకున్నాను. కానీ సినిమా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానిక‌న్నా బాగా వ‌చ్చింది. సినిమాలో మంచి ఫీల్ క‌న‌ప‌డుతుంది. నా బ్యాన‌ర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేశాను. వాటికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా మా బ్యాన‌ర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. డార్లింగ్‌స్వామి డైలాగ్స్ చాలా బాగా రాశాడు. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్ అవుతుంది. గోపీసుంద‌ర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త‌న‌కు థాంక్స్‌. ఒక మంచి సినిమా తీయ‌డానికి స‌హాయ‌ప‌డిన నా న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌.. అన్నారు.

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ..క్రియేటివ్ కమర్షియల్స్ మొదటి సినిమా 'అభిలాష‌' జర్నలిస్టుల క్లాప్, స్విచ్ ఆన్ లతో ప్రారంభమైందని విన్నాను. ఇప్పుడు పి.ఆర్‌.ఒ ల స‌మ‌క్షంలో ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. క‌రుణాక‌ర‌ణ్‌గారు మంచి అవ‌కాశం ఇచ్చారు. మంచి పాత్ర ఇచ్చారు. కె.ఎస్‌.రామారావుగారికి క‌థ న‌చ్చాకే ఈ సినిమా చేశాం. మంచి సినిమా తీశామ‌నే ఫీలింగ్ క‌లిగింది. గోపీసుంద‌ర్‌గారి సంగీతం, సాహిసురేశ్ ఆర్ట్‌డైరెక్ష‌న్‌, అండ్రూ కెమెరావ‌ర్క్‌, డార్లింగ్ స్వామి మాట‌లు సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. స‌హ‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. అంద‌రికీ సినిమా న‌చ్చుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాను.. అన్నాను.

Tej I Love You Trailer Release HighLights

tej i love you
trailer release
sai dharam tej
ks ramarao
O.M Review
O.M Review
23 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
23 Nov 2026
DNK Review
DNK Review
23 Nov 2026
GOAT Review
GOAT Review
23 Nov 2026
Scene Review
Scene Review
23 Nov 2026
Ramayana Review
Ramayana Review
23 Nov 2026