ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Talasani Srinivas Yadav Launches Pantham Second Song

'పంతం'.. పేరు, డబ్బులు తేవాలి: తలసాని!

Talasani Srinivas Yadav Launches Pantham Second SongTalasani Srinivas Yadav Launches Pantham Second Song

టాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. గోపీచంద్ 25వ చిత్ర‌మిది. కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా జూలై 5న విడుద‌ల‌వుతుంది. మోహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ 'రైట్ నౌ...' ను తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిష్ట‌ర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ విడుద‌ల చేశారు. 

ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ - గోపీచంద్‌గారు హీరోగా చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్‌గారు నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'. గోపీసుంద‌ర్‌గారు మంచి సంగీతం అందించారు. మంచి అనుభ‌వం ఉన్న టీమ్ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. యూనిట్ స‌భ్యులంద‌రికీ అభినంద‌నలు తెలుపుతున్నాను. గోపీచంద్‌గారు టాలెంటెడ్ హీరో. త‌న‌కు ఈ సినిమా మ‌రో హిట్ చిత్రంగా మంచి పేరు తేవాలి. ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీ మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా విల‌సిల్లుతుంది. చాలా హిట్ చిత్రాలు వ‌స్తున్నాయి. జూలై 5న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తికి మంచి పేరు.. నిర్మాత రాధామోహ‌న్‌గారికి మంచి డ‌బ్బులు తేవాల‌ని కోరుకుంటున్నాను..అన్నారు. 

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ మాట్లాడుతూ - సినిమా రంగం చాలా గొప్ప రంగం. త‌ల‌సాని శ్రీనివాస్‌గారు సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న ఈ సినిమా రంగం ఇంకా అభివృద్ధిలోకి రావాల‌ని కోరుకుంటున్నాను.. అన్నారు. 

నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారితో చేసిన తొలి సినిమా. చాలా ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించాం. గోపీసుంద‌ర్‌గారు సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను ఈ నెల 21న విడుద‌ల చేస్తున్నాం. అలాగే నేడు త‌ల‌సానిగారి చేతుల మీదుగా రెండో సాంగ్ విడుద‌ల కావ‌డం ఇంకా ఆనందాన్నిస్తుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 5న విడుద‌ల చేస్తున్నాం.. అన్నారు. 

గోపీచంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. 

ఈ చిత్రానికి క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: ర‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.చ‌క్ర‌వ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.ర‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌: బెల్లంకొండ స‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: ప‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కె.చ‌క్ర‌వ‌ర్తి.

Gopichand Pantham Second Song Launch details

pantham second song
gopichand
talasani
chakravarthy
kk radhamohan