సాయిధరమ్ తేజ్ కి ఆ సినిమా ఉన్నట్లే!

మే నుంచి మొదలవ్వనున్న సాయిధరమ్ తేజ్ - గోపీచంద్ మలినేని ప్రొజెక్ట్ 

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జె.భగవాన్-జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నుంచి మొదలవ్వనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావు మాట్లాడుతూ.. ''టాలెంట్ తో మాస్ హీరో ఇమేజ్ సొంతం చేసుకొన్న సాయిధరమ్ తేజ్, కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. ఒక కొత్త జోనర్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతోంది. ఇదివరకు సాయిధరమ్ తేజ్ చేయని కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందనుంది. లేటెస్ట్ మ్యూజికల్ సెన్సేషన్ ఈ చిత్రానికి బాణీలు సమకూర్చనున్నాడు. గోపీచంద్ ప్రస్తుతం మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారు'' అన్నారు.

Sai Dharam Signs His Flop Director Gopichand Malineni!

Sai Dharam, No Lessons Learnt!
sai dharam tej
gopichand malineni
director
bhagawan
pulla rao