Advertisementt

తుంట‌రిగా నారా రోహిత్‌!

Thu 22nd Oct 2015 07:51 AM
thuntari movie,nara rohit,latha hegde,kumar nagendra  తుంట‌రిగా నారా రోహిత్‌!
తుంట‌రిగా నారా రోహిత్‌!
Advertisement
Ads by CJ

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రానికి తుంట‌రి అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ద‌స‌రా రోజున ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయ‌న న‌టిస్తున్న సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్ క‌థ‌ను అందించిన సినిమా ఇది. నారా రోహిత్ ప‌క్క‌న ల‌తా హెగ్దే నాయిక‌గా న‌టిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాత‌లు. సినిమా టాకీపార్టు ఇటీవ‌లే పూర్త‌యింది. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్‌తో క‌నిపిస్తారు.  ఈ సినిమా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతున్న‌ట్టు చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్‌.ప‌ళ‌ని కుమార్‌, మ్యూజిక్ః సాయికార్తీక్‌, ఎడిట‌ర్ః త‌మ్మిరాజు, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, స్టంట్స్ః వెంక‌ట్‌, కొరియోగ్ర‌ఫీః బాబా భాస్క‌ర్‌, నిర్మాత‌లుః అశోక్ బాబా, నాగార్జున్‌, ద‌ర్శ‌క‌త్వంః కుమార్ నాగేంద్ర‌. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ