ర‌జ‌నీ చిత్రం ఖ‌రారైంది

`లింగ` త‌ర్వాత మ‌రో సినిమా ఒప్పుకోలేదు ర‌జ‌నీకాంత్‌. శంక‌ర్‌తో `రోబో2` చేస్తార‌నీ, మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తార‌నీ... ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగింది. అయితే తాజాగా ఆ ప్ర‌చారానికి తెర‌ప‌డింది. ర‌జ‌నీకాంత్ కథానాయ‌కుడిగా న‌టించ‌నున్న కొత్త చిత్రం ఖ‌రారైంది.  `అట్ట‌క‌త్తి`, `మ‌ద్రాస్‌` అనే చిత్రాల్ని తెర‌కెక్కించి విజ‌యాలు అందుకొన్న రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు ర‌జ‌నీకాంత్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌బోతోంది. `లింగ‌` ప‌రాజ‌యం చ‌విచూడ‌టంతో ర‌జ‌నీకాంత్‌తో స‌హా ఆయ‌న అభిమానులు డీలా ప‌డిపోయారు. ఇప్పుడు కొత్త చిత్రంతో ఎలాగైనా విజ‌యం సాధించాల‌న్న క‌సితో ర‌జ‌నీ రంగంలోకి దిగుతున్నారు. 
rajani kanth new movie news
rajani kanth next movie with rajani
Advertisement
Advertisement