పెళ్లికూతురైన స్వాతి..!

CineJosh news

కథాబలం ఉన్న చిత్రాలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, మంచి నటి అనిపించుకుంది స్వాతి. తెలుగులో అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్, స్వామి రారా, కార్తీకేయ తదితర చిత్రాలతో వరుస విజయాలు చవి చూస్తోంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ, అక్కడ కూడా మంచి నటి అనిపించుకుంది. పాత్రల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న స్వాతి ప్రస్తుతం 'త్రిపుర' అనే చిత్రంలో కథానాయికగా నటించడానికి అంగీకరించింది. జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో 40 శాతం టాకీ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు చినబాబు, రాజశేఖర్ లు మాట్లాడుతూ 'తొలి షెడ్యూల్ అనుకున్న సమయానికి పూర్తయిందని' ఆనందంగా చెప్పారు.

దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ "టాకీలో కీలకమైన సన్నివేశాలను ఎంతో ఖర్చుతో ఫిలింసిటీలో మరియు హైదరాబాద్ పరిసరప్రాంతాల్లోని పలు లోకేషన్లలో చిత్రీకరించాము. ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను ఎడిటింగ్ చేసి రష్ చేసాము. చాలా అధ్బుతంగా వచ్చింది. టెక్నీషియన్స్ ఎంతగానో సహకరించారు" అని చెప్పారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎమ్.రాజశేఖర్, కథ-దర్సకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు.​

swathi
colors swathi
tripura movie
swathi marriage news
swathi wedding getup