ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ప్రేమ'రథం' ఎక్కునున్న అల్లు అర్జున్?

బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. యాక్షన్‌తో కూడిన ఒక పక్కా ప్రేమకథని తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నాడు బోయపాటి శ్రీను. ఆ కథని బన్నీకి చెప్పి ఓకే అనిపించుకొన్నాడు. రేపోమాపో సెట్స్‌పైకి వెళ్లబోతున్నారు. స్క్రిప్టు పనులు కొలిక్కి రావడంతో ప్రస్తుతం కథానాయికల గురించి అన్వేషణ జరుగుతున్నట్టు సమాచారం. దాంతో పాటు చిత్రానికి పేరు గురించి కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కథ రీత్యా `రథం` అనే పేరయితే బాగుంటుందని బోయపాటి అభిప్రాయంగా తెలుస్తోంది. ఆ పేరు బన్నీకి కూడా నచ్చడంతో దాదాపుగా అదే పేరు ఖరారు చేయొచ్చని సమాచారం. `సన్నాఫ్ సత్యమూర్తి`తో మరో విజయాన్ని సొంతం చేసుకొన్న బన్నీ... ఈసారి యువతరాన్ని అలరించడమే లక్ష్యంగా బోయపాటి సినిమా చేస్తున్నారు. ఇందులో బన్నీ సరసన ఇద్దరు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది.
allu arjun boyapati movie
ratham title for allu arjun
bunny new movie





































