Advertisementt

మే 7న సమ్మర్‌ స్పెషల్‌గా ‘కిక్‌-2’

Fri 27th Mar 2015 10:47 AM
raviteja,kick 2,surender reddy,kalyan ram,kick 2 on may 7th  మే 7న సమ్మర్‌ స్పెషల్‌గా ‘కిక్‌-2’
మే 7న సమ్మర్‌ స్పెషల్‌గా ‘కిక్‌-2’
Advertisement
Ads by CJ

మాస్‌ మహారాజా రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ‘కిక్‌’ ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ కిక్‌ టీమ్‌తో నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ‘కిక్‌`2’ చిత్రానికి సంబంధించి రెండు పాటలను స్విట్జర్లాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈనెల 31 వరకు ఈ షెడ్యూల్‌ జరుగుతుంది. ఏప్రిల్‌ 3 నుంచి అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించే పాటతో చిత్రానికి సంబంధించిన టోటల్‌ షూటింగ్‌ పూర్తవుతుంది. ఎన్‌టిఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ‘పటాస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన కళ్యాణ్‌రామ్‌ ‘కిక్‌2’తో మరో ఘనవిజయాన్ని సాధించేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్‌ స్పెషల్‌గా మే 7న ‘కిక్‌2’ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

మాస్‌ మహారాజా రవితేజ సరసన రకుల్‌ప్రీత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత నందమూరి కళ్యాణ్‌రామ్‌, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: సురేందర్‌రెడ్డి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ