Advertisement

పుష్పక విమానం: శాన్వి మేఘన ఇంటర్వ్యూ


బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, పిట్ట కథలు, సైరా నరసింహారెడ్డి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాలతో తెలుగ్ ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరోయిన్ శాన్వి మేఘన. ఆమె నాయికగా నటిస్తున్న కొత్త సినిమా పుష్పక విమానం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో మెప్పిస్తానంటోంది శాన్వి. పుష్పక విమానం చిత్రాన్ని దామోదర దర్శకత్వంలో కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా  వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది పుష్పక విమానం. ఈ నేపథ్యంలో తన కెరీర్ సంగతులతో పాటు సినిమా విశేషాలను తెలిపింది శాన్వి మేఘన. ఆమె మాట్లాడుతూ..

Advertisement

- నేను హైదరాబాద్ అమ్మాయిని. కాలేజ్ లో ఉండగా మా క్యాంపస్ లో కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతుండేవి. అక్కడ నన్ను చూసి, ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. మా ఇంట్లో వాళ్లకు నేను సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. నాకు కూడా నటన అంటే అంత ఇంట్రస్ట్ ఉండేది కాదు. ఒకసారి జయసుధ గారు తన టీవీ ప్రోగ్రాంలో అవకాశం ఇవ్వడం కోసం మా ఇంట్లో వాళ్లతో మాట్లాడారు. అంత పెద్ద నటి పిలిచి అవకాశం ఇస్తుంది కాబట్టి మా అమ్మా నాన్న అభ్యంతరం చెప్పలేదు. జయసుధ గారు ఆ టీవీ ప్రోగ్రాంకి నిర్మాత. కానీ అనుకోని కారణాల రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది.

- ఇంతలో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ అనే చిత్రంలో నాయికగా అవకాశం వచ్చింది. ఆ సినిమా అయ్యాక మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి లో ఓ చిన్న క్యారెక్టర్ ప్లే చేశాను. సైరా షూటింగ్ టైమ్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను తమన్నా చెల్లిలా ఉంది ఆడిషన్ వద్దు అన్నారు. ఆ మాట పెద్ద కాంప్లిమెంట్ లా ఫీలయ్యా.

సైరా తర్వాత తరుణ్ భాస్కర్ గారు నెట్ ఫ్లిక్స్ పిట్ట కథలు వెబ్ సిరీస్ కు ఆడిషన్ చేసి తీసుకున్నారు. ఆయనే పుష్పక విమానం  చిత్రానికి నన్ను రిఫర్ చేశారు. దర్శకుడు దామోదర గారు ఆడిషన్ చేసి సెకండ్ లీడ్ గా సెలెక్ట్ చేశారు. 

- పుష్పక విమానం చిత్రంలో నేను షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. చాలా బబ్లీ రోల్ ఇది. ఈ క్యారెక్టర్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. ఈ సినిమాలో హీరో ఆనంద్, గీత్ సైని, నా క్యారెక్టర్స్ ఎక్కడా రెగ్యులర్ హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ లా ఉండవు. అవి కథలో సహజంగా ప్లే అవుతూ ఉంటాయి.

- పుష్పక విమానం  ఫస్టాప్ చాలా ఫన్ గా సాగుతుంది. సెకండాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. సినిమాలో ఆనంద్ క్యారెక్టర్ తో నా రిలేషన్ ఏంటి అనేది  తెరపైనే చూడాలి. సినిమాలో సందర్భానుసారం నా క్యారెక్టర్ వస్తుంది. సినిమా చూశాక చాలా సంతృప్తిగా అనిపించింది.

- ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నా గురించి బాగా చెప్పారు. నా పర్మార్మెన్స్ బాగుందన్నారు. అక్కడే మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. విజయ్ ప్రశంసకు నేనూ, అమ్మా నాన్న హ్యాపీ అయ్యాం.

- హీరోయిన్ గా ఇలాంటి క్యారెక్టర్ లే చేయాలని నియమం పెట్టుకోలేదు. నాకు నచ్చితే నటిస్తాను. ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి గారు, హీరో అల్లు అర్జున్. విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వస్తే వదులుకుంటామా.

- పిట్ట కథలు తర్వాత వెబ్ సిరీస్ లు ఆఫర్స్ వచ్చాయి. అప్పటికే పుష్పక విమానం ఒప్పుకుని ఉన్నాను. అంతలో పాండమిక్ వచ్చింది. దాంతో వెబ్ సిరీస్ లు చేయలేదు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలకు కథలు విన్నాను. ఓకే అయ్యాక వివరాలు చెబుతాను.

Sanvi Meghana Interview:

Sanvi Meghana Interview about Pushpaka Vimanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement