Advertisement

రామానాయుడు గారి స్మారక చిహ్నం ఏర్పాటు!


తెలుగు సినిమా చరిత్రలో డా.డి.రామానాయుడు గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ లో అభివృద్ధి చేసిన వారిలో ముందు వరుసలో ఉంటారు. ఎందో కొత్త నటీనటులను, టెక్నిషియన్స్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన గొప్ప నిర్మాత. దివంగత నిర్మాత డా.డి.రామానాయుడు జయంతి పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఇందులో ఆయన జ్ఞాప‌కార్థం ఏర్పాటు చేసినా సార్మక చిహ్మాన్ని తనయులు సురేష్ బాబు, వెంకటేష్, మనువడు రానాలు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...

Advertisement

నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ.. ''రైతుగా చెన్నైకు వచ్చిన నాన్నగారు నిర్మాతగా మారి ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు చిత్రసీమకు అందించారు. మాతో పాటు ఎంతో మంది కొత్త నటీనటులను, టెక్నిషియన్స్ పరిచయం చేసి వారి అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. ఆయన చేసిన పనులు, చూపిన మార్గాన్ని భావితరాలకు ది నేచురించ్ హ్యండ్స్ అనే స్మారక చిహ్నం ద్వారా అందించబోతున్నాం. ఈ స్మారక చిహ్నం ఆయన క్రమశిక్షణ, అంకిత భావాన్ని తెలియచేస్తుంది.  స్థూపం వద్ద చిన్న ఫలకాలను ఏర్పాటు చేసి అందులో ఆయన జీవితానికి సంబంధించి జనరల్ కొటేషన్స్ ను ముద్రిస్తాం. ఈ స్మారక చిహ్నాన్ని మా సహోదరి, ఓ అర్కిటెక్ తో కలిసి రూపొందించింది. ఇందుకోసం పాండిచ్చేరి నుండి రాతిని తెప్పించి కొత్తగా డిజైన్ చేశాం. ఇలా చేయడానికి ప్రధాన కారణం ఇక్కడకు వచ్చే వారికి, చదువుకొనే విద్యార్థులకు ఆయన్ను గుర్తు చేయడానికి మాత్రమే. అలాగే నాన్న పేరుతో వైజాగ్ లో మ్యూజియం ఆఫ్ సినిమా అనే సందర్శన శాలను ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్రసీమ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించింది. ఆ చిత్రాలకు సంబంధించిన గుర్తులు, వస్తువులను వేటిని భ్రదపరుచుకోలేకపోయాం. వీటన్నింటిని భవిష్యత్ లో భద్రపరుచుకునేలా ఈ మ్యాజయం ఉంటుంది. అలాగే నాన్నగారు రైతు, ఆయనకు వ్యవసాయం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే మెదక్ లో కృషి విజ్ఞాన కేంద్రంను ఏర్పాటు చేసి వ్యవసాయంలో నూతన పద్ధతులను రైతులకు నేర్పడం జరగుతుంది. అందుకు ఏకలవ్య ఫౌండేషన్ వారి సహకారం అందిస్తారు. నాన్నగారు నిర్మించిన సినిమాలపై సీనియర్ పాత్రికేయులు వినాయకరావుగారు ఓ పుస్తకాన్ని రాశారు. ఆయన ఆ పుస్తకాన్ని ఎక్కడైతే ముగించారో అక్కడి నుండి ఇప్పటి వరకు మరో పుస్తకాన్ని రాయమని కూడా ఆయనకు చెప్పాను. వినాయకరావుగారు అలాగే రాస్తానని అన్నారు. ఇక గతేడాది మాత్రమే నేను నిర్మాతగా ఏ సినిమాలు చేయలేదు. కానీ ఇకపై కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించే విధంగా చిన్న సినిమాలను నిర్మిస్తాను. అలాగే నాన్నగారి పేరు మీదు ఓ అవార్డును కూడా ఏర్పాటు చేస్తాం'' అని అన్నారు.

వెంకటేష్ మాట్లాడుతూ.. ''నాన్నగారు అందరినీ ప్రేమించే వ్యక్తి, అందరిచేత ప్రేమించబడే వ్యక్తి. గొప్ప మనిషి. ఆయన జ్ఞాపకాలను గుర్తు పెట్టుకుని హ్యాపీగా ఉండటానికి ప్రయత్నిస్తాను'' అన్నారు.

రానా మాట్లాడుతూ.. ''తాతగారు విజన్, వాల్యూస్ తో ముందుకెళ్లారు కాబట్టే ఆయన గొప్ప నిర్మాతగా, వ్యక్తిగా ఎదిగారు'' అని అన్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement