Advertisement

ఆ నటుల ఇళ్లలో రూ. 100 కోట్లు దొరికాయ్‌..!


గత పదేళ్ల కాలంలో బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌ అనే తేడా లేకుండా ఫిల్మ్‌ ఇండస్ట్రీల మార్కెట్‌ విలువ నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు ఓ సినిమా 50 కోట్లు వసూలు చేస్తేనే గొప్పగా చెప్పుకునే బాలీవుడ్‌లో ఇప్పుడు రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించడం చాలా సాధారణ విషయంగా మారింది. అదే స్థాయిలో కోలీవుడ్‌, టాలీవుడ్‌ కూడా వృద్ధి చెందాయి. ఇక సినిమాల కలెక్షన్లకు తగిన విధంగా నటీనటుల రెమ్యూనరేషన్‌లలో కూడా భారీ మార్పులు వచ్చాయి. అయితే మారందల్లా వారు చెల్లించే ఇన్‌కం ట్యాక్స్‌ మాత్రమే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఐటీశాఖ తరచూ సినీ తారల ఇళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల కిందట తమిళ స్టార్‌ విజయ్‌, హీరోయిన్స్‌ నయనతార, సమంతాతోపాటు పలువురు నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది.

Advertisement

సినిమాల్లో దేశభక్తి, సామాజిక సేవ అంటూ డైలాగులు చెప్పే నటీనటుల ఇళ్లపై ఐటీ శాఖ నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐటీకి లెక్కలు చెప్పని దాదాపు 100 కోట్ల స్థిర, చర ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో ఏక కాలంలో 35 చోట్ల 400 మంది అధికారులతో దాడులు నిర్వహించిన ఐటీశాఖ అనుకున్న మేర అక్రమ ఆస్తుల జాడలను కనిపెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక ఇప్పుడు తమ ఇళ్లలో దొరికిన ఆదాయానికి సంబంధించి లెక్కలు చెప్పే పనిలో సదరు నటీనటులు, నిర్మాతలు తలమునకలై ఉన్నారు. అయితే ఐటీ శాఖ ఎవరెవరి ఇళ్లలో ఏ మేర ఆస్తులు స్వాధీనం చేసుకున్నది బయటపెట్టాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. అప్పుడే నటీనటులు సినిమాల్లోనే కాకుండా నిజ జీవితాల్లో కూడా కాస్త నిజాయితీగా బతుకుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు సమంతా, విజయ్‌, నయనతార వంటి నటీనటులు ఎలాంటి సమాధానం చెబుతారో..?.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement