Advertisement

బాబును నిరాశపరిచిన వేలంపాట..!!


స్మగ్లర్ల పుణ్యమా అని ఏపీ ప్రభుత్వం వద్ద పెద్దమొత్తంలో ఎర్రచందనం నిల్వలు పేరుకుపోయాయి. స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న వందల టన్నుల ఎర్రచందనాన్ని ఏపీ అధికారులు పట్టుకొని అమ్మకానికి పెట్టారు. ఈ ఎర్రచందనం నిల్వలనుంచి కనీసం రూ. 4 వేల కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని టీడీపీ ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో ఎర్రచందనం విక్రయానికి స్పందన బాగా రావడంతో మరోసారి విక్రయించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

Advertisement

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మొత్తం 122 టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయానికి పెట్టింది. దీని ద్వారా కనీసం 2 వేల కోట్ల రూపాయలు ఆర్జించాలన్నది టీడీపీ సర్కారు వ్యూహం. అయితే ఈసారి కొనుగోలుదారులనుంచి ఎర్రచందనం విక్రయానికి పెద్దగా స్పందన రాలేదు. కేవలం 122 టన్నుల్లో 47 టన్నులకు మాత్రమే ఆర్డర్లు వచ్చాయి. దీంతో 2 వేల కోట్లు అనుకున్న ఆదాయం కాస్త 187 కోట్లకు పడిపోయింది. దీంతో టీడీపీ సర్కారు తీవ్ర నిరాశకు గురైనట్లు సమాచారం. ఈసారి భారీగా ప్రచారం కల్పించి మరోసారి ఎర్రచందనం విక్రయానికి ఏర్పాట్లు చేయాలన్న నిర్ణయానికి బాబు సర్కారు వచ్చినట్లు తెలిసింది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement