Advertisement

'అభిషేకం' సీరియల్ 2000వేల ఎపిసోడ్ల పూర్తి..!


దర్శకరత్న దాసరినారాయణరావు నిర్మాతగా సౌభాగ్య మీడియా ప్రై.లి. బ్యానర్‌పై తెలుగులో నిర్మించిన సీరియల్‌ ‘అభిషేకం’. ఈ సీరియల్‌ 2000 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా...

Advertisement

దర్శకరత్న దాసరినారాయణరావు మాట్లాడుతూ ‘‘ఈ సీరియల్‌ వెయ్యి ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్నప్పుడే బాపినీడుగారు రెండువేల ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకుంటుందని అన్నారు. ఇప్పుడు నిజంగా ఆ మైల్‌స్టోన్‌ రీచ్‌ అయింది. చాలా మంది డబ్బు కోసం సీరియల్‌ తీస్తుంటారు. కానీ నేను ఆ ఉద్దేశంతో సీరియల్‌ చేయలేదు. నేను విశ్వామిత్ర కంటే ముందుగానే రామాయణం, మహాభారతం సీరియల్స్‌ చేశాను. మొదటిసారి బీటా కెమెరాలో విశ్వామిత్ర సీరియల్‌ చేశాను. నా భార్య పద్మకి సీరియల్స్‌ అంటే చాలా ఇష్టం. నన్ను సీరియల్స్‌ తీయమని అంటుండేది. నేను సీరియల్‌ తీయాలని అనుకున్నప్పుడు వచ్చిన ఐడియానే అభిషేకం. నా ప్రేమాభిషేకం సినిమాలా ఇది రెండు వేల ఎపిసోడ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. రెండు వేల ఎపిసోడ్స్‌ అంటే 331 సినిమాలకు సమానం. నేను 151 సినిమాలనే చేశాను. ఈ సీరియల్‌ ఇలాగే కొనసాగి 4000 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకోవాలి’’ అన్నారు. 

మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘‘సౌతిండియాలోనే 2000 ఎపిసోడ్లను దాటిన మొదటి సీరియల్ ఇది. గురువుగారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 'తాతా మనువడు' చిత్రంతో విజయ డంకా మోగించి అత్యదిక చిత్రాలను తెరకెక్కించిన దర్శకునిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. నాగేశ్వరరావు గారు దాసరి గారికి తెలియనిది లేదని, ఆయనొక హ్యూమన్ కంప్యూటర్ అని అనేవారు. దూరదర్శన్ టివిలో 'విశ్వామిత్ర' సీరియల్ తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపజేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆయన తీసిన సీరియల్‌ ఇలా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. 

జయసుధ మాట్లాడుతూ ‘‘మహిళల ఆదరణ పొందుతూ ఒక సీరియల్‌ దక్షిణాదిలో కొత్త రికార్డు క్రియేట్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 

ఎమ్.ఎస్.కోటారెడ్డి మాట్లాడుతూ "నేను కామెడీ సీరియల్స్ మాత్రమే తీయగలనని 'అభిషేకం' లాంటి సీరియల్ తీయలేనని దాసరి గారికి చాలా మంది చెప్పారు. కాని ఆయన నా మీద నమ్మకంతో 200 ఎపిసోడ్ల వరకు నాకు డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత కొన్ని పర్సనల్ కారణాల వలన సీరియల్ కంటిన్యూ చేయలేకపోయాను. ఓ మంచి ప్రాజెక్ట్ లో నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన దాసరి గారికి నా కృతజ్ఞతలు" అని చెప్పారు.

లక్ష్మీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘నేను దాసరిగారి ఏకలవ్య శిష్యుణ్ణి. ఆయన నిర్మాతగా చేసిన సీరియల్‌ను నేను ఒక భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో  జయసుధ, బాపినీడు, కోటా రెడ్డి, హేమాలయకుమారి, ప్రభు, రమణబాబు, తాండవ కృష్ణ, అజయ్‌శర్మ, జయప్రసాద్‌, సోమారెడ్డి, సంజీవి, మూర్తి, రామకృష్ణ ప్రసాద్, సీరియల్ నటీనటులు తదితరులు పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement