Advertisement

ఆ నాయకుల.. తర్వాత సున్నా!


ఒకప్పుడు తెలుగు రాజకీయాలనేకాదు జాతీయ రాజకీయాలను సయితం ప్రభావితం చేసిన నాయకులు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి ప్రత్యేకించి మన్మోహన్‌ సర్కారుకి అమెరికాతో ‘అణు’ బంధంపై కామ్రేడ్లతో పొరపొచ్చాలొచ్చినప్పుడు బల నిరూపణకు భుజం కాసింది రాజశేఖరరెడ్డి. టిడిపి ఎంపీ ఆదికేశవులు నాయుడు వంటి వార్ని ప్రభావితం చేసిన రాజకీయ దురంధుడు రాజశేఖరరెడ్డి. 2009 ఎన్నికలలో 11 మంది ఎంపీలకు తగ్గకుండా పార్లమెంటుకి ఎంపిక చేసి పంపిస్తానని హామీ ఇచ్చి, చూపించిన ఘనుడు. రాజీవ్‌గాంధీ అనంతరం పివి ప్రధాని కావడానికి ఢల్లీిలో చక్రం తిప్పింది కోట్ల విజయ భాస్కరరెడ్డి. భారత రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకరుగా అత్యున్నత పదవులను అధిరోహించింది సంజీవరెడ్డి. ఈరోజున జగన్మోహన్‌రెడ్డి వెనుక ఇంత కేడర్‌ వుండటానికి కారణం ` లీడర్‌ రాజశేఖరరెడ్డి. ఆ లీడర్‌ని చూసే పిసిసి మాజీ సారధి బొత్స సతీ, సోదర సమేతంగా వైయస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఏరి, కానరారేరి అలనాటి రాజకీయ దురంధులైన ‘రెడ్డి’ నాయకులు నేడు. ఆఖరివాడయిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా కాంగ్రెసు అధిష్టానానికి చెమటలు పట్టించారు, రాష్ట్ర విభజన వాయిదాపడేలా చేశారు. ఆ రాజకీయ నైపుణ్యం, ప్రత్యర్ధులను ముప్పతిప్పలు పెట్టే వ్యూహ రచయితలు కనుమరుగయినట్టేనా! జైపాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఏమంటారు రేవంత్‌రెడ్డి ఉదంతంపై .... అసెంబ్లీని రద్దుచేస్తానని కెసిఆర్‌ హెచ్చరించి ఎవర్ని కట్టడిచేశారు.... రోజురోజుకీ బలం పుంజుకుంటున్న కెసిఆర్‌ రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహం పన్నగల మొనగాడు లేదు. వైయస్సార్‌ని, సోనియాని, చంద్రబాబుని తన పొలిటికల్‌ గేమ్‌ ప్లానుతో అద్భుతంగా వాడుకున్న ఆటగాడు కెసిఆర్‌!

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement