Advertisement

నిందితులను దాచిపెట్టిన చంద్రబాబు..!!


నోటుకు ఓటు కేసులో రేవంత్‌రెడ్డిని శనివారం ఏసీబీ అధికారులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలునుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు విషయమై విచారించారు. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి వద్ద దొరికిన రూ.50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయన్న విషయమై వారి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఏ-4గా ఉన్న ముత్తయ్య ప్రస్తుతం ఏపీలోనే ఉండి మీడియాతో కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఆయన్ను ఏపీ పోలీసులే అక్కడికి తరలించి రక్షణనిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

రేవంత్‌రెడ్డి కేసుకు సంబంధించి ఏసీబీ నలుగురిపై కేసు నమోదు చేసింది. అందులో రేవంత్‌తోపాటు మరో ఇద్దర్ని అదులపులోకి తీసుకున్నప్పటికీ ముత్తయ్య మాత్రం వారికి చిక్కలేదు. ఆయన్ను ఏపీ పోలీసులే విజయవాడకు తరలించి ఓ ఎమ్మెల్యే సంరక్షణలో ఉంచినట్లు తెలిసింది. ముత్తయ్య పట్టుబడితే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే చంద్రబాబు ఎలా చేయిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఆరోపిస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement