Advertisement

తెలంగాణలో నడుస్తున్నది చంద్రబాబు లెగసీ!


ఎన్టీఆర్‌ అంటే క్రమశిక్షణకు, నీతి నిజాయితీలకు, నిబద్ధతకు ఓ బ్రాండ్‌ నేమ్‌. ఆయనతో ఓ పార్టీ పుట్టింది, ఓ తరం కొత్త నాయకత్వం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్‌ నెలకొల్పిన ఆ సంప్రదాయానికి మెరుగులు దిద్ది, కార్పొరేట్‌ హంగులు అద్దిన ఘనత చంద్రబాబుది. తమిళనాడులో ‘ద్రవిడకజగం’ రాజకీయ రంగులు అద్దుకుని ‘డిఎంకె’గా ఎలా ఆవిర్భవించిందో, ఆ డిఎంకెనుంచి ‘అన్నా డిఎంకె’ ఎలా రూపుదిద్దుకున్నదో అలాగే ప్రాంతీయత నేపధ్యంగా టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. అయితేనేం, కెసిఆర్‌ ` పోచారం ` కడియం శ్రీహరి ` తీగల కృష్ణారెడ్డి ` తుమ్మల నాగేశ్వరరావు ` తలసాని శ్రీనివాస యాదవ్‌ వంటి చంద్రబాబు కేబినెట్‌ మంత్రులే ఇప్పుడు టిఆర్‌ఎస్‌ కేబినేట్‌ దిగ్గజాలు. వీరులేని ప్రభుత్వ శాఖల పనితీరు సవాళ్ళని, సమస్యలని కొనితెచ్చుకుంది. ఉదాహరణకు తెలంగాణ విద్యాశాఖను తీసుకుంటే జగదీశ్వరరెడ్డి విద్యాశాఖ మంత్రిగా వున్నప్పుడు స్థానికత సమస్యని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజు రీ`ఇంబర్స్‌మెంట్‌ గందరగోళానికి దారితీసింది. అనర్హత వేటు పడ్డ ప్రైవేటు కళాశాలలు కొన్ని సుప్రీంకోర్టు గడప తొక్కాయి. తెలంగాణలో విద్యావ్యవస్ధ తీరు తెన్నులు బెంబేలెత్తిస్తున్న సమయంలో పార్లమెంటు సభ్యుడయిన కడియం శ్రీహరిని స్టేట్‌ కేబినెట్‌లోకి తీసుకున్నారు కెసిఆర్‌. అనుభవశాలి అయిన కడియం సాంగత్యంలో బడి బండిని పట్టాలెక్కించారు కెసిఆర్‌. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వ శాఖల పనితీరుపై చంద్రబాబు ముద్ర కనిపిస్తోంది. అభివృద్ధిలో కెసిఆర్‌ దూసుకుపోతున్న వైనం, కెటిఆర్‌ ఐటి రంగాన్ని పరుగెత్తిస్తున్న తీరు వెరసి మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పనిచేస్తున్న విధానాన్ని చూస్తుంటే  చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంలో ఫిజికల్‌గా లేకపోయినా ఆయన ‘లెగసీ’ కంటిన్యూ కావడాన్ని గమనించవచ్చు.  చంద్రబాబు తాను పనిచేయడమేకాదు పాలనా యంత్రాంగాన్ని ఎలా పరుగులు తీయించారో అంతకన్నా వేగంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు కెసిఆర్‌, ఏ నాయకునికయినా ఇంతకన్నా ఏం కావాలి చంద్రన్నా! టిడిపి ` టిఆర్‌ఎస్‌ ఒకే కొమ్మకు పూసిన రెండు పుష్పాలు.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement