Advertisement

అందినట్టే అంది చేజారిన ఎమ్మెల్సీ పదవి..!!


అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది జూపుడి ప్రభాకర్‌ పరిస్థితి. వైసీపీనుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతడు ఓటమిపాలై టీడీపీలో చేరాడు. అంతకుముందు చంద్రబాబును తీవ్రంగా విమర్శించినప్పటికీ జూపుడి సామాజికవర్గం, ఆయన వాక్‌చాతుర్యం చూసి టీడీపీ అధికారప్రతినిధిగా బాబు నియమించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఖాయం చేశారు. టీడీపీలో మొదటినుంచి కొనసాగుతున్న నాయకులను పక్కకు పెట్టి జూపుడి ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వచ్చినా చంద్రబాబు లెక్కపెట్టలేదు. అయితే చివరి క్షణంలో జూపుడి ఎమ్మల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు.

Advertisement

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముండే జూపుడికి అక్కడే ఓటు హక్కు ఉంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవికి పోటీచేయాలంటే ఆయా రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండాల్సిందే. ఈ లెక్కన ఇప్పుడు జూపుడికి ఏపీలో ఓటుహక్కు లేకపోవడంతో పోటీకి అర్హత కోల్పోయే అవకాశం ఏర్పడింది. ఇంత చిన్న విషయమై ఆయన ముందు జాగ్రత్తపడకపోవడంతో ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ పదవిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇక జూపుడి స్థానంలో మాజీ శాసనసభ అధ్యక్షురాలు ప్రతిభాభారతిని ఎమ్మెల్సీగా ఎన్నిక చేస్తారని 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement