Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: ధనరాజ్‌


తేజగారి ‘జై’ నా తొలి చిత్రం. కానీ అందులో ‘గుంపులో గోవింద’ లాంటి క్యారెక్టర్‌. నేను కాకుండా, మా అమ్మ మాత్రమే ఆ క్యారెక్టర్‌లో నన్ను గుర్తు పట్టింది. కానీ, రామ్‌ హీరోగా సుకుమార్‌గారి దర్శకత్వంలో రూపొందిన ‘జగడం’లో నేను చేసిన ‘నాంపల్లి సత్తి’ క్యారెక్టర్‌ నటుడిగా నా జాతకాన్ని మార్చేసింది. ఆ తర్వాత నుంచి నా కెరీర్‌ ‘పరుగు’ పెడుతూనే ఉంది. ‘పరుగు, పిల్ల జమీందార్‌, కెమెరామెన్‌ గంగతో రాంబాబు, గోపాల.. గోపాల’ వంటి చిత్రాలు నటుడిగా నాకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక ‘జబర్దస్త్‌’ ప్రోగ్రామ్‌ నన్ను ప్రతి ఇంటికీ పరిచయం చేసింది’ అంటూ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తూ, ఆ చిత్రంతో నిర్మాతగా మారుతున్న ధనరాజ్‌. ‘డైరెక్టర్‌ సుకుమార్‌ నటుడిగా నాకు భిక్ష పెడితే.. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు హీరో రామ్‌ ఎన్నో పర్యాయాలు నన్ను ఆర్ధికంగా ఆదుకొన్నారు. ఆ కృతజ్ఞతతోనే నా బిడ్డకు వాళ్లిద్దరి పేర్లు జత చేసి ‘సుక్కురామ్‌’ అని పెట్టుకొన్నాను. ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నది మా అబ్బాయి ‘సుక్కురామ్‌’ కాబట్టి.. పరోక్షంగా ఈ సినిమాను నిర్మిస్తున్నది సుకుమార్‌గారు, రామ్‌గారే’ అంటూ వారిద్దరి పట్ల తన కృతజ్ఞతను ధనరాజ్‌ ప్రకటించుకున్నాడు!

Advertisement

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణతో కలిసి ధనరాజ్‌ నటిస్తూ.. నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనింగ్‌ థ్రిల్లర్‌ ‘ధనలక్ష్మి తలుపు తడితే’ షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోంది. సాయి అచ్యుత్‌ చిన్నారి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా.. మే 7 తన జన్మదినం కావడాన్ని పురస్కరించుకొని మీడియాతో ఆత్మీయంగా ముచ్చటించారు ధనరాజ్‌. ఈ చిత్రంలో నటించిన మనోజ్‌నందం, అనిల్‌ కళ్యాణ్‌, విజయ్‌సాయి వంటి వారంతా రూపాయి రెమ్యునరేషన్‌ తీసుకోకుండా నటిస్తే.. మిగతావాళ్లంతా నామమాత్రపు పారితోషికంతో ఈ సినిమాకి పని చేసారని ధనరాజ్‌ అన్నారు. నాగబాబు, సింధుతులాని, రణధీర్‌, శ్రీముఖి వంటి వారు అందించిన సహాయసహకారాలు మరువలేనివని ధనరాజ్‌ తెలిపారు. ఎన్నారై బిజినెస్‌మ్యాన్స్‌ ప్రసాద్‌ మల్లు`ప్రతాప్‌ భీమిరెడ్డి ఈ చిత్రం ఎగ్జిక్యూషన్‌లో ఎంతో హెల్ప్‌ చేసారని ధనరాజ్‌ అన్నారు. ఈనెల 22న ఆడియో విడుదల చేసి, జూన్‌ మొదటివారంలో ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ధనరాజ్‌ వెల్లడిరచారు!!

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement