Advertisement

షాకిచ్చే సంతోషకరమైన వార్త..!!


హైదరాబాద్‌ప్రజలకు షాకినిచ్చినే చల్లటి కబురును జెన్‌కో ఎమ్‌డీ ప్రభాకర్‌రావు తెలియజేశారు. ఈ ఏడాది వేసవిలో అసలు హైదరాబాద్‌లో పవర్‌కట్‌ లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. అయితే గతేడాది వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా కరెంటు కోతలు విధించారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో కోతలు కొనసాగాయి. దీంతో వర్షాకాలంలోనే భారీగా కోతలు విధిస్తున్న ప్రభుత్వం ఇక వేసవిలో అసలు కరెంటు సరఫరా చేస్తుందా..? లేదా..? అనే అనుమానాలు కూడా తలెత్తాయి. కాని వేసవి ప్రారంభమైనప్పటికీ తెలంగాణలో పెద్దగా విద్యుత్‌ కోతలు లేకపోవడం ప్రజలను ఆనందానికి గురిచేస్తోంది. అయితే ఈ వేసవి మొత్తం హైదరాబాద్‌లో పవర్‌ కట్స్‌ లేకుండా చూస్తామని జెన్‌కో ఎమ్‌డీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. అయితే ఆరు నెలల్లోనే తెలంగాణలో విద్యుత్‌ సరఫరా పరిస్థితి ఇంత మెరుగు పడటానికి సర్కారు చేపట్టిన చర్యలే కారణమని తెలుస్తోంది. వీలైనంత వరకు కేంద్రంనుంచి, ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం సమస్యను అధిగమించాలని చూస్తోంది. అంతేకాకుండా థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ను 73శాతం నుంచి 87 శాతానికి పెంచడం, ట్రాన్స్‌మిషన్‌ నష్టాలను తగ్గించడంతో కరెంటు ఆదాతోపాటు దాదాపు రూ. 900 కోట్ల ఖర్చు కూడా మిగిలందని ప్రభాకర్‌రావు ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే వచ్చే నాలుగేళ్లలో అసలు కరెంటు  కట్‌ లేకుండా చూస్తానని కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement