Advertisement

ఆ నలుగుర్నీ ఆడిపోసుకోవడం అన్యాయం!


చిన్న సినిమా, చిన్న నిర్మాత అనడం సమంజసంకాదు. సినిమా పరిశ్రమలో చిన్న అన్న పదానికి స్ధానంలేదు. లోబడ్జెట్‌, హై బడ్జెట్‌ అనడం సమంజసం. సినిమా విడుదలయిన మొదటిరోజు మొదటి ఆటవరకే ఈ ‘లో - హై’ తేడా. సినిమా బాగుంటే బడ్జెట్‌ ‘లో’ అయినా పట్టించుకోరు. శంకరాభరణం, పెళ్ళిసందడి, తాతమనవడు, ప్రతిఘటన తదితరాలు విడుదలకు ముందు లో-బడ్జెట్‌ చిత్రాలు. ప్రస్తుతం విడుదలవుతున్న చిత్రాలలో నూటికి తొంభైశాతం ఫ్లాప్స్‌, హిట్స్‌ కూడా. సొమ్ము పెట్టిన నిర్మాతకి పెట్టుబడి తిరిగివస్తే హిట్‌ సినిమా, అదే సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటార్‌, జిల్లా వారీ కొనుగోలుదారునికి పెట్టుబడి తిరిగిరానందున అది ఫ్లాప్‌ సినిమా. ఎవరికి వారికి పెట్టిన పెట్టుబడి తిరిగివస్తే ‘హిట్‌’.  

Advertisement

నలుగురి చేతిలోనే థియేటర్లు వున్నాయని విమర్శించే వారికి నా వినతి: ఎన్నో థియేటర్లు మూతపడ్డాయి, కొన్ని కళ్యాణ మండపాలుగా, మరికొన్ని షాపింగ్‌ కాంప్లెక్సులుగా మారాయి. ఇప్పటికీ మూతపడ్డ థియేటర్లు మచిలీపట్నం నడిబొడ్డున కనిపిస్తాయి. ఘన చరిత్ర వున్న విజయవాడ దుర్గా కళా మందిరం, రామాటాకీస్‌, విజయాటాకీస్‌ పరిస్థితి ఏమిటో చెప్పండి. అసలు సమస్య ఈ నలుగురు కాదు. ఆ సమస్యని సమస్యగా చెప్పండి. మీ ప్రయత్నాన్ని అందరూ హర్షిస్తారు. బాధ్యతగల పత్రికా రంగం ఈ బాధ్యతని భుజానికెత్తుకోవాలి. ఆసియాలో అతిపెద్ద స్టూడియో అధినేత రామోజీరావు గారికి ఫిలిమ్‌ ప్రొడక్షన్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఆడియో కంపెనీ, టి.వి. పేపరువున్నా రెగ్యులర్‌ ప్రొడక్షన్‌ ఆపడానికి కారణం ఈ నలుగురే అనుకోవాలా? ఇద్దరు హీరోలు, స్టూడియోలు, థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్‌, పోస్టర్‌ ప్రింటింగ్‌ వున్న ఈ నలుగురిలో ఒకరయిన వారు సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తున్నారో గమనించండి.

-తోటకూర రఘు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement