Advertisement

రోజా మాటలు మంటలు పుట్టిస్తున్నాయ్‌..!!


రోజాకు కాస్త నోరు ఎక్కువేనన్న సంగతి అందరికీ తెలిసిందే. తన వాక్చాతుర్యంతోనే ఆమె రాజకీయాల్లో పేరుగాంచారు. ఇక ఆమె మాట్లాడే తీరుచూసే స్వయంగా వైఎస్‌ఆర్‌ కూడా  ఆమెను పిలిచిమరీ కాంగ్రెస్‌లో చేరమని కోరారు. ఆయన హయాంలో అది సాధ్యం కాకున్నా.. ఆ తర్వాత జగన్‌ సారథ్యంలో ఆమె వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎట్టకేలకు అసెంబ్లీలో కాలుపెట్టగలిగారు. అయితే మాట్లాడే తీరే అప్పుడప్పుడు వైసీపీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. పుత్తూరులో జరిగిన ఓ సంఘటన ఇప్సుడు రోజాకు తలనొప్పిగా మారింది.

Advertisement

 

           అనవసరంగా తనపై టీడీపీ ప్రభుత్వం కేసులు బనాయిస్తుందంటూ రోజూ పుత్తూరు ఎంపీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సీఐని రోజా దగ్గరకు పిలిచారు. ఆయన సమీపానికి వెళ్లకపోవడంతో తాము ఎస్సీ, ఎస్టీలం కాదని, తమ వద్దకు వచ్చి మాట్లాడవచ్చంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గిరిజన, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. రాజకీయాల్లో ఉండి కూడా దళితులను అవమానించేలా మాట్లాడిన రోజా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ అటు దళితవర్గాలు, టీడీపీ వర్గాలు ఆందోళనకు దిగాయి. నిజానికి రోజా ఎస్సీ, ఎస్టీల రుణాల గురించే కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఆ వర్గాలపైనే తొందరపాటు వ్యాఖ్యలు చేసి రోజా ఇబ్బందుల్లో పడ్డారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement