Advertisement

ఆర్‌ఎస్‌ఎస్‌ మీటింగ్‌కు అజీజ్‌ ప్రేమ్‌జీ.. దేనికి సంకేతం..??


ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలది విడదీయలేని బంధం. సర్కారులో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అధికారం మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ను కాదని ప్రధాని మోడీనుంచి ఏ ఒక్కరు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. ఇక ఈ విషయం బిజినెస్‌మెన్లకు కూడా బాగానే తెలుసు. అందుకే వారు కేంద్రంతోపాటు ఇటు ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా మెప్పించే పనిలో పడ్డారు.

Advertisement

ఇక బిజినెస్‌ టైకూన్‌, ఐటీ దిగ్గజం విప్రో అజీజ్‌ ప్రేమ్‌జీ ఢిల్లీలో జరిగిన ఓ ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన ఆ సభకు హాజరుకావడమే కాకుండా వేదికపై ఆసీనులై ప్రసంగం కూడా ఇవ్వడం మరింత వింతగొలిపే విషయం. అజీజ్‌ ప్రేమ్‌జీకి ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి హాజరుకావాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఇప్పుడు అర్థంకాకుండా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌భగవత్‌ ఆహ్వానం మేరకే అజీజ్‌ ఆ సమావేశానికి హాజరైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలో లేకపోతే కూడా అజీజ్‌ ప్రేమ్‌జీ ఇలాంటి సమావేశానికి హాజరయ్యేవారా అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇక బిజినెస్‌పరంగా తాము నెట్టుకురావాలంటే ముందుగా కేంద్రం కంటే కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ మెప్పు పొందడం ప్రధానమని భావిస్తున్నట్లు అజీజ్‌ ప్రేమ్‌జీ హాజరు చెప్పకనే చెబుతోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement