Advertisement

జగన్‌తో జగడాలేల యనమలా!


జగన్‌ని విమర్శించడమే ప్రధమ కర్తవ్యంగా జగన్‌ తుమ్మినా దగ్గినా ఏం చేసినా ప్రెస్‌మీట్‌ పెట్టి చిలవలు పలవులుగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక శాఖామాత్యులు యనమల రామకృష్ణుడు. ఆంధ్రప్రదేశ్‌నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాల నుంచి పన్ను వసూలు, ‘ఆహార భద్రత’ అమలు వలన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై 700 కోట్ల అదనపు భారం, అట్టడుగుకి శ్రీశైలం నీటిమట్టం, పులివెందుల ఉపకాలువకు గండి కొట్టించిన ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి : ఇలా ఎన్నో సమస్యలు. పట్టిసీమ ఎత్తిపోతల పధకంపై జగన్‌కి అభ్యంతరాలున్నాయి. అందివచ్చిన అన్ని వేదికలపై ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. జగన్‌తో ముఖాముఖి చర్చించండి లేదా పట్టిసీమపై ఆయన అనుమానాల్ని నివృత్తిచేయండి. అంతేగాని జగన్‌ ఢల్లీి పర్యటనపై గాలి పోగు చేయకండి. మోదీ - జగన్‌ సమావేశంపై యనమల, కంభంపాటి, దేవినేని ఉమా, కెఈ కృష్ణమూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి ఇంతమంది మాట్లాడటం బాలేదు. రాజధానిని హైదరాబాదునుంచి ఆంధ్రాకి తరలించే దమ్ములేదు, ఉద్యోగులు సహకరించరు. పనిపై హైదరాబాదు వెళ్ళాలంటే కెసిఆర్‌కి ఆంధ్రులు ఎంట్రీ టాక్సు కట్టాలి. తెలంగాణ నిర్ణయంపై మాట్లాడే దమ్ములేదు గాని జగన్‌పై దుమ్మెత్తిపోయడానికి ధైర్యం వస్తుంది. ఇంతకీ రాష్ట్ర విభజనని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన కేసు ఏమయిందో మీలో ఏ ఒక్కరయినా చెప్పగలరా?

Advertisement

- తోటకూర రఘు

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement