Advertisement

చందమామ కథలుకి కరువయిన చప్పట్లు!


62వ జాతీయ చలన చిత్ర అవార్డులు :

Advertisement

ఫంక్షన్‌కి స్టార్‌ గ్లామర్‌ అద్దే ప్రయత్నం జరగలేదు; ఓటు బ్యాంకు - పొలిటికల్‌ ఈక్వేషన్సు కనిపించలేదు. భారతీయ న్యాయ వ్యవస్థని వ్రేలెత్తి చూపుతూ మరాఠీ - హిందీ - గుజరాతీ - ఇంగ్లీషు భాషలలో నిర్మించిన ‘కోర్ట్‌’ ఉత్తమ చిత్రంగా; మణిపూర్‌కు చెందిన బాక్సింగ్‌ ఛాంపియన్‌ మేరీకోమ్‌ జీవితం ‘మేరీకోమ్‌’ బెస్ట్‌ పాపులర్‌ ఫిలిమ్‌గా, ట్రాన్స్‌ జెండర్‌గా నటించిన కన్నడ నటుడు ‘సంచారి విజయ్‌’ ఉత్తమ నటుడుగా  (కన్నడ  చిత్రం : ‘నాన్‌ అవనల్ల అవళు’) ఉత్తమ నాయికగా ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, ఉన్ని కృష్ణ కుమార్తె చిన్నారి ఉత్తర ఉన్ని కృష్ణ తొలిపాటకు జాతీయ అవార్డు దక్కాయి. ఈ అవార్డుల ఎంపికలో వైవిధ్యం వుంది; నిజాయితీ వుంది; ట్రాన్స్‌ పెరెన్సీ వుంది!

ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యే అర్హతవున్న చిత్రంలేని ప్రాంతీయ సినిమాలున్నాయి. కానీ భారతీయ భాషలలో అత్యధిక చిత్రాలను అందిస్తున్న తెలుగుకి ఆ దుర్దశలేదు : ప్రవీణ్‌ సత్తారు ‘‘చందమామ కథలు’’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయింది; ఇదే సమయంలో ‘సినిమా రంగంపై ఉత్తమ రచన’ విభాగంలో పసుపులేటి పూర్ణ చంద్రరావు ‘‘సైలెంట్‌ సినిమా’’ అవార్డుకి ఎంపిక కావడం గర్వకారణం.

‘చందమామ కథలు’ సినిమా తీయడానికి - విడుదల చేయడానికి దర్శక నిర్మాత సత్తారు చాలా కష్టపడ్డారు. ఉన్నదంతా ఊడ్చిపెట్టారు. ఇటువంటి ప్రయోజనాత్మక, ప్రయోగాత్మక చిన్న సినిమాని ప్రభుత్వాలు ఆదుకోవాలి; సినీ పరిశ్రమ ప్రోత్సహించాలి! ఈ తరహా సినిమాలు బతికితేనే జాతీయ చిత్ర పటంలో తెలుగు సినిమా రెపరెపలాడుతుంది. 

సానియామీర్జా, సింధు, కశ్యప్‌ వగైరా క్రీడాకారులకు భూరి బహుమానాలిచ్చి ప్రోత్సహించిన కెసిఆర్‌ జాతీయ బహుమతికి ఎంపికయిన  ఈ ‘‘చందమామ కథలు’’, ‘‘సైలెంట్‌ సినిమా’’ని ఏ విధంగా ప్రోత్సహిస్తారో చూద్దాం! ఇదే సందర్భంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన ‘‘చందమామ కథలు’’ యూనిట్‌కి తెలుగు పరిశ్రమ అభినందనలు అందజేయకపోవడం బాధాకరం!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement