Advertisement

పవన్‌..ఈ ఖర్చులోని ఔచిత్యం మీకు అగపడలేదా?


పార్ట్ 5

Advertisement

వందలాది కాలేజీలు ఖాళీగావుండగా, కొత్త కట్టడాలు.... లక్షల కోట్ల వ్యయం!

పవన్‌ కళ్యాణ్‌ .... ఈ ఖర్చులోని ఔచిత్యం మీకు అగపడలేదా?

ఆంధ్రా - తెలంగాణ :

రెండు రాష్ట్రాలలో ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి : దీపం వెలిగించే దిక్కులేక, ప్రభుత్వ పన్నులు చెల్లించలేక, బ్యాంకు రుణాలు తీర్చలేక యాజమాన్యాలు బావురుమంటున్నాయి. తెలంగాణలో అయితే కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు స్వచ్ఛందంగా తమ విద్యార్ధుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

- ఒక రకంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ఇది అందివచ్చిన అవకాశం. ఆ కాలేజీ బిల్డింగులను అద్దెకు తీసుకొని ప్రభుత్వ కార్యాలయాలు పెట్టుకోవచ్చు. దీనివలన తక్కువ ఖర్చుకే ప్రభుత్వ కార్యాలయాలు దొరుకుతాయి; పన్నులరూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది; బ్యాంకు రుణాల చెల్లింపులు జరుగుతాయి.కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఆలోచనను దగ్గరకు రానివ్వకపోవడంలోని ఔచిత్యమేమిటో అర్ధంకావడంలేదు. ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాదులోనే కొనసాగడం వలన, ఆంధ్రా శాసన సభ - శాసన మండలి సమావేశాలు హైదరాబాదులోనే జరగడం వలన ప్రతి చిన్నపనికి సొంత రాష్ట్రం ఏర్పడినా ఆంధ్రులు హైదరాబాదు పరుగెత్తాల్సిన దుస్థితి ఏర్పడిరది. దీనివలన ట్రాన్సుపోర్టు ఖర్చులు - టోల్‌ గేట్ల చెల్లింపులు - టూరిజం - హోటలు పరిశ్రమ అభివృద్ధి తెలంగాణలో కనిపిస్తుంది!

ఆంధ్రా మంత్రులకు - వారి సిబ్బందికి ఎంత ఖర్చవుతోంది? ఈ దుబారాని అరికట్టలేమా? 

బిజెపి ప్రభుత్వం నిధులివ్వదు - టిఆర్‌ఎస్‌ నీళ్ళివ్వదు : ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ‘క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌’ ఏం చేస్తోంది?

నీటి విషయమై తానే చొరవతీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మాట్లాడినట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు. అందుకు ప్రతిగా మచిలీపట్నం పోర్టు నిర్వహణని తెలంగాణ ప్రభుత్వానికి కట్టబెట్టడానికి లోపాయికారీ ఒప్పందం జరిగిందని ఓ అనధికార వార్త గుప్పుమంది. నిజానిజాలు ఆ ముగ్గురికే ఎరుక!

రాష్ట్రంలో - కేంద్రంలో 'టిడిపి -బిజెపి' ప్రభుత్వాలు రావాలని విస్తృతంగా ప్రచారంచేసిన పవన్‌ కళ్యాణ్‌ ఖాళీగాపడివున్న ఇంజినీరింగ్‌ - మెడికల్‌ కాలేజీలను వాడుకోమని చంద్రబాబుకి ఎందుకు సలహా ఇవ్వరు?

(మరికొంత ఆరవ భాగంలో)

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement