Advertisement
Google Ads BL

భార్య వ్యాపారంపై భర్త ఫన్నీ కామెంట్స్!


బాలీవుడ్ కపుల్స్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్  ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. తాజాగా విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ నిర్వహిస్తోన్న `కే బ్యూటీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం గురించి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను నవ్విస్తున్నాయి. భార్య బ్రాండ్‌కు మద్దతుగా తాను కూడా ఒక మేకప్ బ్రాండ్ డీల్ కోసం ప్రయత్నిస్తున్నానని, తద్వారా ఆమె ఉత్పత్తులను మరింతగా ప్రచారం చేయోచ్చ‌ని విక్కీ చమత్కరించాడు.

Advertisement
CJ Advs

కత్రినా తన బ్రాండ్ విషయంలో ఎంత అంకితభావంతో ఉంటుందో? విక్కీ వివరిస్తూ,  ఆమె విజయం పట్ల  గర్వంగా ఉందన్నాడు. అయితే ఇంట్లో కూడా కత్రినా తన మేకప్ టిప్స్ - ప్రొడక్ట్స్ గురించి చర్చిస్తుంటుందని, అందుకే తాను కూడా ఈ విషయంలో కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాల్సి వస్తోందని న‌వ్వేసాడు. ఒక మేకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం తో  ఆమె వ్యాపారానికి ఇంట్లోనే  అదనపు ప్రమోటర్ దొరుకుతాడని  సరదాగా వ్యాఖ్యానించాడు.

ఈ ఇంటర్వ్యూలో విక్కీ మాటలు విన్న అభిమానులు, భార్య ఎదుగుదలను ప్రోత్సహించడంలో విక్కీ ఎప్పుడూ ముందుంటడ‌ని ప్రశంసిస్తున్నారు. కత్రినా కైఫ్  నటిగానే కాకుండా  విజయవంతమైన వ్యాపారవేత్తగా కే బ్యూటీని అగ్రస్థానంలో నిలబెట్టింది. భర్తగా విక్కీ చేసే ఇలాంటి చిన్న చిన్న జోకులు వారి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత అందంగా హైలైట్ చేస్తున్నాయి. విక్కీ ఫన్నీ మేనర్ లోనే భార్య బ్రాండ్‌కు ఉండాల్సిన క్రేజ్‌ను మరోసారి పెంచేలా చేశారు.

Vicky Kaushal recently promoted his wife Beauty brand:

Vicky Kaushal recently promoted his wife Katrina Kaif Kay Beauty brand
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs