దక్షిణాది అగ్ర కథానాయిక సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీస్ బ్యానర్‌పై అనౌన్స్ చేసిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా ప్రారంభ ప్రకటన అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించినా? ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇండస్ట్రీలో పెద్దగా సందడి కనిపించడం లేదు. సమంత వంటి స్టార్ హీరోయిన్ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉండాలి. కానీ ప్రచార చిత్రాలు లేదా రెగ్యులర్ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడటం లేదు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ నిశ్శబ్దంగా జరుగుతున్నట్లు సమాచారం.
సాధారణంగా సమంత సినిమాలకు సోషల్ మీడియాలో , ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ ఉంటుంది. అయితే గత కొన్ని చిత్రాల ఫలితాలు , ఆమె వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల తీసుకున్న విరామం తర్వాత వస్తోన్న సినిమా కావడంతో, దీనిపై మరింత హైప్ అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. `మా ఇంటి బంగారం` అనే టైటిల్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అనిపిస్తున్నా? దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వంటివి విడుదల చేస్తేనే సినిమాపై మళ్ళీ ఆసక్తికి అవకాశం ఉంటుంది. కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే సరిపెట్టడం వల్ల సినిమా మేకింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే రావాల్సిన మైలేజ్ రావడం లేదు.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద విజయం లభించాలంటే ప్రమోషన్లు కీలక పాత్ర పోషిస్తాయి. సమంత తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న మొదటి సినిమా కావడం తో దీనిపై ఆమెకు ప్రత్యేక బాధ్యత ఉంది. త్వరలోనే చిత్ర యూనిట్ ఏదైనా క్రేజీ అప్‌డేట్‌తో వస్తే తప్ప సినిమాకు రావాల్సిన టాక్ ఆఫ్ ది టౌన్ స్టేటస్ రావడం కష్టం. సినిమా విడుదల సమయానికి భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించి, గట్టి ఇంపాక్ట్ చూపించాల్సిన అవసరం సమంతకు ఎంతైనా ఉంది. ఈ పనంతా సమంత ఈ పది రోజుల్లోనే చేయగలగాలి. ఎందుకంటే చిత్రం మే 15న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.