Advertisement
Google Ads BL

బుట్టబొమ్మ మనసు దోచిన వారసుడు!


బుట్టబొమ్మ పూజా హెగ్డే  కొంతకాలంగా సినిమాల కంటే  వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతోనే ఎక్కువ‌గా  హైలైట్ అవుతోంది. తాజాగా అమ్మ‌డు బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో డేటింగ్‌లో ఉందనే పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.  ఇద్ద‌రు కలిసి ముంబై వీధుల్లో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న ఫోటోలు ,వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు  ఇద్ద‌రి మధ్య ఏదో నడుస్తోందని చర్చించుకుంటున్నారు.  ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

Advertisement
CJ Advs

రోహన్ మెహ్రా ఎవరో కాదు. దివంగత బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. గతంలో వీరిద్దరూ స్నేహితులుగానే మెలిగేవారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా? ఇటీవల వారు తరచుగా కలిసి కనిపిస్తుండటంతో ఇది స్నేహానికి మించిన బంధమేనని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే కానీ, రోహన్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా పూజా హెగ్డేపై కొన్ని రూమర్స్ వ‌చ్చినా? ఆమె తన పనిపైనే దృష్టి పెట్టి వాటిని పెద్దగా పట్టించుకోలేదు.

ప్రస్తుతం పూజా హెగ్డే కెరీర్ పరంగా కూడా కీలక దశలో ఉంది. సౌత్‌లో కాస్త గ్యాప్ వ‌చ్చినా? మ‌ళ్లీ ఇక్క‌డ పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. హిందీలో అమ్మ‌డి ప్లాన్ వ‌ర్కౌట్ కాక‌పోవ‌డంతో తిరిగి సౌత్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు ముడు నాలుగేళ్ల‌గా చేస్తోంది. ఇప్పుడిప్పుడే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తెలుగులో బిగ్ స్టార్స్ స‌ర‌స‌న ఛాన్సులు తిరిగి ఎప్పుడొస్తాయా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. కానీ ఇక్క‌డి మేక‌ర్స్ అమ్మ‌డిని అంత సీరియ‌స్ గా తీసుకుం టున్న‌ట్లు క‌నిపించ‌లేదు. ఈ విష‌యంలో పూజా స్వ‌యంకృప‌రాధం కూడా కొంత ఉంది. అప్ప‌ట్లో ఓ పాన్ ఇండియా సినిమా విష‌యంలో నెగిటివ్ గా వెళ్లింద‌నే ప్ర‌భావం భ‌విష్య‌త్ పై ప‌డుతుంద‌ని ఊహించ‌లేక‌పోయింది.

Actress Pooja Hegde:

Pooja Hegde
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs