Advertisement
Google Ads BL

30 వేల ధ‌ర‌కే కార్.. నెల‌వారీ ఖ‌ర్చు జీరో!


ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కార్ కొనుగోలు చేయాలంటే, 8ల‌క్ష‌లు మొద‌లు ఎంతైనా పెట్టాల్సి ఉంటుంది. నెల‌వారీగా 10వేలు మెయింటెనెన్స్ ఖ‌ర్చు ఉంటుంది. కానీ ఎలాంటి మెయింటెనెన్స్ ఖ‌ర్చు లేకుండా, కేవ‌లం 30 వేల‌కే కార్ కొనుగోలు చేయాలనుకుంటే ఒక ఆప్ష‌న్ ఉంది. గుజరాత్‌కు చెందిన సాధుల్‌భాయ్ చావడా అనే గ్రామీణ ఆవిష్కర్త కేవలం 25 వేల నుండి 30 వేల రూపాయల వ్యయంతో అద్భుతమైన సోలార్ కారును తయారు చేశారు. 

Advertisement
CJ Advs

పాత ఎలక్ట్రిక్ బైక్ విడిభాగాలు, ఇనుప తుక్కు , పాత స్కూటీ టైర్ల వంటి వేస్టేజీని సేకరించి ఈ వాహనాన్ని రూపొందించడం విశేషం. ఖరీదైన ఇంధనాలు అవసరం లేకుండా కేవలం సూర్యరశ్మితో నడిచే ఈ కారు సామాన్యులకు తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది.

ఈ కారు పైన అమర్చిన రెండు సోలార్ ప్యానెల్స్ బ్యాటరీలను నిరంతరం ఛార్జ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఒక్క రూపాయి కూడా ఇంధనంపై ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఒకసారి పూర్తి ఛార్జింగ్‌తో ఈ వాహనం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో దాదాపు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. మెయింటెనెన్స్ ఖర్చులు దాదాపు సున్నా అని చెప్పవచ్చు. 

ముగ్గురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలిగే ఈ కారులో ఫ్యాన్ , మ్యూజిక్ సిస్టమ్ వంటి వసతులు కూడా ఉండటం గమనార్హం. అయితే ఏదైనా ఇన్నోవేష‌న్ కార్పొరెట్ చేతికి చిక్కితే దానిపై మ‌రింత ప‌రిశోధ‌న‌కు వంద‌ల కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. ఆ మొత్తం భారాన్ని వినియోగ‌దారుడిపై మోపాలనుకుంటే కార్ వెళను రూ.8ల‌క్ష‌లు లేదా అంత‌కుమించి నిర్ణ‌యించాల్సి ఉంటుంది. 

New car:

30 000 car
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs