Advertisement
Google Ads BL

గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో లోకేష్


విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇకపై విశాఖ అంటే ఏఐ డేటా హబ్ గుర్తొస్తుంది. ఇక మీదట విశాఖపట్నం గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవబడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ సమీపాన తర్లుపాడు వద్ద ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... గూగుల్ ఏఐ హబ్ తో విశాఖ ముఖచిత్రం మారబోతోంది. ఇది ఒక భూమి పూజ కాదు. భవిష్యత్తుకి పునాది, ఇది ప్రాజెక్ట్ కాదు ఒక జనరేషన్‌ని మార్చే మూవ్‌మెంట్. ఆంధ్రప్రదేశ్ రైజింగ్ - ఇండియా లీడింగ్ అంటూ మాట్లాడారు. కేంద్ర మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ భారతదేశ డిజిటల్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవాన్ని అసాధారణ వేగం, స్పష్టతతో నడిపిన డైనమిక్ లీడర్ అని నారా లోకేష్ కొనియాడారు. ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా పట్టాలెక్కించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గూగుల్, అదానీ గ్రూప్, భారతి ఎయిర్‌టెల్ సంస్థ లీడర్లు, భారత ప్రభుత్వ అధికారులు, ప్రతిష్ఠాత్మక ఇండస్ట్రీ పార్టనర్లు, విశాఖ యువత, ఉత్తరాంధ్ర ప్రజలకు, గూగుల్ కోసం భూములు ఇచ్చిన రైతులకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఈరోజు సరికొత్త చరిత్రకు పునాది

28 ఏప్రిల్ 2026... సరికొత్త చరిత్ర కు పునాది. ఈ తేదీ రాసి పెట్టుకోండి. విశాఖపట్నం పేరు ఇకపై ప్రపంచం మొత్తం వినిపిస్తుంది. ఇప్పటివరకు ఒక లెక్క... ఇక నుంచి ఒక లెక్క. ఇప్పటి వరకు విశాఖ స్టీల్ సిటీ... ఇక నుండి విశాఖ ఏఐ డేటా హబ్. ఇప్పటి వరకు గూగుల్‌లో విశాఖపట్నం గురించి సెర్చ్ చేశారు. ఇక నుండి గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో విశాఖపట్నం ఉంటుంది. వైజాగ్ లో జి అంటే గూగుల్ అని గట్టిగా చెప్పాలి, వైజాగ్‌లో సౌండ్ చేస్తే దేశం మొత్తం వినిపించాలి. గూగుల్ రాకుండా అడ్డుకోవడానికి కేసులు వేసిన బ్యాచ్‌కి వినిపించాలి.. అంటూ నారా లోకేష్ ఎమోషనల్ గా మాట్లాడారు.

Nara Lokesh Speech At Foundation stone laying ceremony of Google Data Center :

Google AI Data Center foundation ceremony in Visakhapatnam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs