Advertisement
Google Ads BL

పాన్ ఇండియా మూవీస్ కి లీకుల షాక్


క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న రామ్ చరణ్ పెద్ది చిత్రం ప్రస్తుతం స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో దర్శకుడు బుచ్చి బాబు, రామ్ చరణ్, శృతి హాసన్ ఉన్నారు. పెద్ది చిత్రాన్ని జూన్ 25 రిలీజ్ అంటూ ప్రకటించారు. ఈలోపే పెద్ది చిత్రం నుంచి లీకులు రావడం మేకర్స్ కి షాకిచ్చింది. రామ్ చరణ్, శ్రుతి హాసన్ డ్యాన్స్ క్లిప్పింగ్స్ షూటింగ్ ప్లేస్ నుంచి లీక్ అయ్యాయి.

Advertisement
CJ Advs

ఇక నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రం ఆగష్టు లో విడుదలకు రెడీ అవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని-కాయదు లోహర్ జంటగా మంచు మోహన్ బాబు విలన్ గా తెరకెక్కుతున్న ప్యారడైజ్ చిత్రం పై భీభత్సమైన అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి లీకులు రావడం అందరికి షాకిచ్చింది.

ది ప్యారడైజ్ నుంచి కూడా ఒక ఒక ఫైట్ సీన్ లీక్ అయింది. ఇలా రెండు భారీ పాన్ ఇండియా మూవీస్ నుంచి కొన్ని వీడియోలు లీక్ కావడంతో మేకర్స్ లో ఆందోళన నెలకొంది. మరి ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నా ఇలా లీకులు కావడం పట్ల నిర్మాతలే కాదు అభిమానులు కూడా ఆందోళన పడుతున్నారు.

Same Day Leak Shock Hits Peddi and The Paradise:

Peddi And The Paradise Movie Scenes Leaked From Shooting Spot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs