నందమూరి బాలకృష్ణ -కొరటాల శివ కలయికలో సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబినేషన్ కు ముహూర్తం ఖరారైంది. మే తొలివారంలో కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొరటాల శివ తనదైన శైలిలో ఓ సామాజిక అంశానికి పక్కా మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి బాలయ్య కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. `వీరసింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కొరటాల శివ తో బాలయ్య చర్చలు ఫలించడం తో పట్టాలె క్కించడానికి రెడీ అవుతున్నారు. ఏక కాలంలో రెండు సినిమా షూటింగ్ లు పూర్తి చేయడం బాలయ్యకు పెద్ద పనేం కాదు.
ఏ పనికైనా బాలయ్య రంగంలోకి దిగనంత సేపే. వన్స్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్లే బాలయ్య పనితనం కనిపిస్తుంది. బాలయ్య తో సినిమా అంటే దర్శకులు కూడా అంతే స్వేచ్ఛగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారి కథల్లో బాలయ్య కాళ్లు..వెళ్లు పెట్టరు. దర్శకులకు కావాల్సినంత స్వేచ్ఛ కల్పిస్తారు. కొరటాల కూడా అందుకే ధైర్యంగా ముందుకెళ్తున్నారు. గతంలో ఓ సీనియర్ స్టార్ తో ఎదురైన ఇబ్బంది బాలయ్య ఉండదని భావించి మూవ్ అవుతున్నారు.