Advertisement
Google Ads BL

వైవాహిక బంధం తర్వాత తొలి క్రేజీ ప్రాజెక్ట్!


స‌మంత -రాజ్ నిడిమోరుల ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. సామ్ మ‌ళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టి ప‌ని చేస్తోంది. బాలీవుడ్ లో నిలదొక్కుకోవ‌డం ఎలా? అన్న దానిపై సీరియ‌స్ గా ఆలోచిస్తుంది. రాజ్ స‌హ‌కారం కూడా ఉండ‌టంతో వీలైనంత త్వ‌ర‌గా అక్క‌డా స‌త్తా చాటాల‌ని చూస్తోంది. అయితే పెళ్లి తర్వాత

Advertisement
CJ Advs

స‌మంత నుంచి రిలీజ్ అవుతున్న  తొలి చిత్రం `మా ఇంటి బంగారం`. సామ్ తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరులతో కలిసి నిర్మిస్తున్నారు.

నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా సమంత భర్త రాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. `రాజ్ అద్భుతమైన క్రియేటర్. అంతేకాదు గొప్ప వ్యక్తి కూడా అని  ప్రశంసించడం వారి మధ్య ఉన్న వృత్తిపరమైన గౌరవాన్ని, వ్యక్తిగత అనురాగాన్ని చాటిచెబుతోంది. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ జంట టాలీవుడ్‌లో పవర్‌ఫుల్ జోడీగా మారే ఛాన్స్ ఉంది.

`మా ఇంటి బంగారం`చిత్రం  సాధారణ గృహిణి అత్యంత శక్తివంతమైన మహిళగా ఎలా ఎదిగింది అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో  తెరకెక్కుతోంది. సమంత కెరీర్‌లో  ఈ సినిమా  విభిన్నమైన ప్రయత్నమని చెప్పాలి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వ‌స్తోన్న  తొలి చిత్రం కావడంతో సమంత నటనలో ఎలాంటి పరిణతి కనిపిస్తుందా? అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Samantha on Maa Inti Bnagaram:

Samantha Needs to Step Up Promotions for Maa Inti Bangaram
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs