యంగ్ హీరో శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఏడాది నారి నారి నడుమ మురారి తో హిట్ అందుకున్న శర్వానంద్ మూడు నెలలు తిరిగేసరికి బైకర్ ని దించాడు. బైకర్ మిక్స్డ్ టాక్ తోనే మంచి కలెక్షన్స్ సాధించినట్టుగా మేకర్స్ ప్రకటించారు. భారీ ప్రమోషన్స్, తండ్రి-కొడుకు మధ్యన సాగే ఎమోషనల్ డ్రామా అన్ని బైకర్ ని ప్రేక్షకులు మెచ్చేలా చేసాయి.
థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన శర్వానంద్ బైకర్ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. బైకర్ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. ఏప్రిల్ 3 న థియేటర్స్ లోకి వచ్చిన ఈ హాచిత్రాన్ని నాలుగు వారాలు తిరిగేలోగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లోకి తెచ్చేస్తుంది.
నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 1 నుంచి బైకర్ స్ట్రీమింగ్ లోకి రానుంది. సో థియేటర్స్ లో మిస్ అయిన ఈ ఎమోషనల్ డ్రామా ను ఓటీటీ లో వీక్షించేందుకు రెడీ అవ్వండి.