Advertisement
Google Ads BL

ఏపీ అభివృద్ధి కి బాబు ఉండాల్సిందే


ఏపీ లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం అడుగడుగునా శ్రమిస్తున్నారు. ఏపీ ఐటి మినిస్టర్ నారా లోకేష్ ఏపీ కి పలు ఐటి కంపెనీలను తీసుకొచ్చేందుకు ఆయా కంపెనీ సీఈఓ లతో మాట్లాడడం.. దాని కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పటికే వైజాగ్ వేదికగా కాగ్నిజెంట్ నుంచి పలు కంపెనీలను ఏపీ కి తీసుకురావడంలో నారా లోకేష్ చేసిన కృషి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి ఫలించి వైజాగ్ సిటీ అంత‌ర్జాతీయ టెక్ మ్యాప్‌లో చేర‌నుంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఇండియా లోనే ఓ కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతుంది. 

అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో ఏపీ కే కాదు వైజాగ్ సిటి కే తలమానికం కానుంది. దాదాపుగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది గూగుల్. 1 గిగావాట్ సామర్ధ్యంతో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది. గూగుల్‌ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజితో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ ఫ్రా అందుబాటులోకి రానుంది. దీనికి ఈ నెల 28న అంటే రేపు మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు చేతుల మీదుగా శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది.

CM Chandrababu to unveil Google AI data centre project:

CM Chandrababu to unveil Google AI data centre project in Visakhapatnam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs