Advertisement
Google Ads BL

ఆ డేట్ పై కన్నేసిన అఖిల్ లెనిన్


పెద్ది కోసం త్యాగం చేస్తూ మే 1 నుంచి జూన్ 26 కి పోస్ట్ పోన్ అయిన అఖిల్ లెనిన్ ని రామ్ చరణ్ పెద్ది చిత్రం నీడలా వెంటాడుతూ మళ్లీ జూన్ 25 కి ఖాయం చెయ్యడంతో లెనిన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. పెద్ది కోసం ఒకసారి చేసిన త్యాగాన్ని పెద్ది మేకర్స్ మరోసారి కూడా చేయమంటూ జూన్ 25 కి డేట్ లాక్ చేసారు. 

Advertisement
CJ Advs

లెనిన్ జూన్ 26 నుంచి వాయిదాపడడం తప్ప మరో మార్గం లేకుండా చేసారు. దానితో లెనిన్ పోస్ట్ పోన్ అనివార్యమైంది. అందుకే లెనిన్ మేకర్స్ కొత్త డేట్ కోసం చూస్తున్నారట. వారు ఆగష్టు 13 దగ్గర అగారని, లెనిన్ చిత్రాన్ని ఆగష్టు 13 న విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఆ డేట్ పై అధికారిక ప్రకటన ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.

అఖిల్ లెనిన్ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని, లెనిన్ తో గట్టిగా కొట్టాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. అయ్యగారు అఖిల్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసి మూడేళ్లవుతుంది. లెనిన్ తో ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తుంటే పెద్ది వలన లెనిన్ పదే పదే పోస్ట్ పోన్ అవుతూ లేట్ అవడం వారిని డిజప్పాయింట్ చేస్తుంది. 

Lenin has been postponed to June 26:

Akhil Akkineni Lenin has been postponed to June 26
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs