పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ లుక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎప్పుడు ట్రెండీ లుక్స్ తో యూత్ ని కవ్విస్తుంటుంది. తాజాగా మోడ్రెన్ ఫోజులతో అద్దరగొట్టేసింది. వైట్ టాప్ బ్లాక్ మిడ్డీ లో జాన్వీ కపూర్ ఓ ఫ్యాషన్ షో కోసం ట్రెండీ గా రెడీ అయ్యింది. ఆ కాస్ట్యూమ్ లో జాన్వీ లుక్స్ బ్రైట్ గా వెలిగిపోతున్నాయి.
ట్రెడిషనల్ గా కన్నా మోడ్రెన్ వేర్ లోనే జాన్వీ కపూర్ సూపర్బ్ గా కనిపిస్తుంది. పెద్ది చిత్రంతో జూన్ 25 న రాబోతున్న జాన్వీ కపూర్ ఈ చిత్రంతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తుంది. పెద్ది హిట్ తో జాన్వీ కి మరిన్ని సౌత్ అవకాశాలు క్యూ కడతాయి. అసలే బాలీవుడ్ లో సక్సెస్ కోసం బాగా స్ట్రగుల్ అవుతుంది. అక్కడ కన్నా ముందే జాన్వీ కి సౌత్ లో పెద్ది తో బిగ్ బ్రేక్ దొరికేలా కనబడుతుంది.
ప్రస్తుతం జాన్వీ కపూర్ పేరు అల్లు అర్జున్-అట్లీ రాకా లోను వినిపిస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. పెద్ది సక్సెస్ తో అమ్మడు కోలీవుడ్ లోను అడుగుపెట్టే అవకాశం అయితే పుష్కలంగా ఉంది.