Advertisement
Google Ads BL

సెలెబ్రిటీ హోదా వెనుక మోసాలు


సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో మద్యం ఏరులై పారితే అది కూడా అబద్దం, పోలీసులు కావాలని ఇరికించారని అంది. ఇప్పుడు చీటింగ్ కేసు పెడితే అస్సలు దానికి నాకు సంబంధమే లేదు అంటుంది. కమ్యూనిటీ కార్డు వాడుతుంది, మీడియా ని టార్గెట్ చేస్తుంది. కావాలనే తన ఎదుగుదల చూడలేని వాళ్ళు చేస్తున్న పని అంటూ బుకాయిస్తుంది.

Advertisement
CJ Advs

కానీ సింగర్ మంగ్లీ పై వస్తున్న ఆరోపణలు చూస్తే మంగ్లీ సామాన్యు రాలు కాదు. సెలెబ్రిటీ ముసుగులో మోసాలకు తెరలేపింది అనాల్సిందే.. వందల కోట్ల రూపాయల మైక్రోఫైనాన్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రమావత్ మధుతో కలిసి మంగ్లీ ప్రత్యక్షంగా భాగస్వామి అయ్యింది అనే ఆరోపణలు వస్తున్నాయి.. అది కూడా మంగ్లీ కమ్యూనిటీ నుంచే రావడం గమనార్హం.

అమాయక గిరిజనులను, సామాన్యులను పెట్టుబడుల పేరుతో నమ్మించి, మంగ్లీ తమ్ముడు, రమావత్ మధు, ఇంకా కొంతమంది మోసం చేశారని, ఇందులో మంగ్లీ పాత్ర కేవలం ప్రచారానికే పరిమితం కాలేదని, ఆమె ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని, ఈ స్కామ్ కేవలం రెండు తెలుగు రాష్టాలకే పరిమితం కాలేదు అని, కర్ణాటకకు చెందిన ఒక మాజీ మంత్రి మనవడి వద్ద కూడా సుమారు రూ. 80 లక్షల వరకు వసూలు చేశారని మంగ్లీ అండ్ గ్యాంగ్ పై ఆరోపణలు వస్తున్నాయి. 

మరి మంగ్లీ తనేం తప్పు చేయలేదు అంటూ డీజీపీని, కమిషనర్‌ను కలిసి ఆ కేసు కు తనకు సంబంధం లేదని ఫిర్యాదు చేయడం ఏమిటో మంగ్లీ కే తెలియాలి. కానీ సెలెబ్రిటీ హోదా వచ్చాక దాని వెనుక ఇలాంటి మోసాలు చేస్తే బాగుపడడం అటుంచి బయటపడితే పరువు మొత్తం పాయె. 

More Trouble for Mangli:

Singer Mangli denies links to fraud case, says allegations baseless
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs