Advertisement
Google Ads BL

రాజశేఖర్ గ్రేట్ లాస్ జ‌ర్నీ


టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రాజశేఖర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని రివీల్ చేసారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన క్లాసిక్ హిట్ `జెంటిల్‌మేన్` సినిమా ఆఫర్ మొదట తనకే వచ్చిందని, నిర్మాతలు అడ్వాన్సులతో తన చుట్టూ తిరిగారని ఆయన వెల్లడించారు. 

Advertisement
CJ Advs

అయితే అదే సమయంలో `అల్లరి ప్రియుడు` చిత్ర బృందం డేట్స్ విషయంలో పట్టుబట్టడంతో ఆ భారీ ప్రాజెక్టును వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దీనిపై తనకు పెద్దగా విచారం లేకపోయినా, ఆ సినిమా చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజానికి రాజశేఖర్‌లోని ఇంటెన్సిటీని.. ఆయనకున్న `యాంగ్రీ మేన్` ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకునే శంకర్ ఈ కథను ఆయన వద్దకు పంపి ఉండవచ్చు.

అయితే విశ్లేషణాత్మక కోణంలో చూస్తే ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోల కెరీర్‌ను మలుపు తిప్పాయనే చెప్పాలి. `జెంటిల్‌మేన్` సినిమా యాక్ష‌న్ కింగ్ అర్జున్ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోవడమే కాకుండా, అతడిని ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ హీరోగా నిలబెట్టింది. మరోవైపు రాజశేఖర్‌కు `అల్లరి ప్రియుడు` ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. 

అప్పటివరకు సీరియస్ పాత్రలకే పరిమితమైన ఆయనలోని ఫన్ వినోదం యాంగిల్‌ను ఈ సినిమా ఆవిష్కరించింది. ల‌వ‌ర్ బోయ్ గా అత‌డిని ఎలివేట్ చేసింది  ఈ చిత్రం. అర్జున్ జెంటిల్‌మేన్‌గా, రాజశేఖర్ అల్లరి ప్రియుడుగా తమ తమ సినిమాలకు పూర్తి న్యాయం చేసి ఇండస్ట్రీలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

Rajasekhar Great Loss Journey:

Hero Rajasekhar 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs