నటి అషు రెడ్డి తనని పెళ్లి పేరుతొ మోసం చేసింది అంటూ లండన్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్న ధర్మేంద్ర అతని కుటుంబ సభ్యులు అషు రెడ్డిపై కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి నగదు రూపేణా, బంగారం రూపేణా, కార్లు రూపేణా కోట్లకు కోట్లు (9.5 కోట్లకు పైగానే)తీసుకుని నమ్మించి మోసం చేసినట్లుగా ధర్మేంద్ర తండ్రి అషు రెడ్డి పై కేసు పెట్టారు.
ధర్మేంద్ర నుంచి డబ్బు తీసుకుని కార్లు కొనుక్కుని, విల్లా కొని తన పేరుపై రాయించుకుంది అని ధర్మేంద్ర తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈకేసు వివరాలు బయటకు వచ్చిన కొద్దిసేపటికే అషు రెడ్డి ఇన్స్టా వేదికగా రియాక్ట్ అయ్యింది. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాసినా, ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చింది.
దానితో పాటుగా ఆమె కొద్ది రోజుల క్రితం కొల్హాపూర్ లక్ష్మీదేవి టెంపుల్ దర్శించుకున్న ఫోటోలను షేర్ చేసింది. చక్కగా చీరకట్టుకుని అమ్మవారికి సమర్పించేందుకు కొబ్బరికాయ, పువ్వులు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులను అషు రెడ్డి తీసుకెళ్తున్న ఫోటోలను షేర్ చేసింది.