Advertisement
Google Ads BL

NTRNeel - ఫిలిం సిటీలో యాక్షన్


యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) మూవీ షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అనే ప్రశ్నలకు మేకర్స్ రీసెంట్ గానే రిలీజ్ డేట్ తో ఆన్సర్ ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ 11 న డ్రాగన్ విడుదల అన్నారు. అంటే ఇంకా ఏడాదిపైనే సమయం ఉండడంతో ఫ్యాన్స్ లో కాస్త రిలాక్స్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా #NTRNeel మూవీ షూటింగ్ రామోజి ఫిలిం సిటీలో జరుగుతుంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్ లో కొన్ని భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు. ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్‌ నేతృత్వంలో ఎన్టీఆర్, ఇంకా కీలక నటులపై ఈ యాక్షన్ సీన్స్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. 

అయితే మలయాళ యాక్టర్ తోవినో థామస్ #NTRNeel మూవీ నుంచి తప్పుకున్నాక ఇంకా ఆ కేరెక్టర్ లోకి నీల్ ఏ నటుడిని ఎంపిక చేసినట్లుగా లేదు. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పేరు వినిపిస్తున్నా దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమా కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా సినిమాలో కనిపించదట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు.. రిలాక్స్ అయిపోవచ్చు.

NTR in action mode:

NTR Dragon in fullswing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs