Advertisement
Google Ads BL

డైరెక్ట్ గా తండ్రికి స్పాట్ పెట్టిన కవిత


ఇప్పటివరకు తండ్రి కేసీఆర్ ని విమర్శించకుండా అన్న కేటీఆర్, బావ హరీష్ రావు, సంతోష్ రావు లను విమర్శిస్తూ బీఆర్ నుంచి బయటపడిన కల్వకుంట్ల కవిత మొదటి సారి నిండు సభలో తండ్రి కేసీఆర్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసింది. ఈరోజు ఏప్రిల్ 25 న శనివారం మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభ వేదికగా కవిత తన పార్టీకి టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాష్ట్ర సేన)గా ఆమె నామకరణం చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సభ లో తండ్రి కేసీఆర్ ను కవిత టార్గెట్ చేస్తూ విమర్శించారు. తండ్రి కేసీఆర్ ను పదే పదే కవిత టార్గెట్ చేసూ మాట్లాడడం బీఆర్ఎస్ శ్రేణులకు గొంతులో పచ్చి వెలక్కాయపడేలా చేసింది. కవిత తన కొత్త పార్టీ ప్రకటన సాక్షిగా తండ్రి కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

కేసీఆర్ మారిపోయారని, రాజకీయ పరిణతి కోల్పోయారంటూ, ఆనాటి కేసీఆర్‌ వేరు..ఈనాటి కేసీఆర్‌ వేరు. ఆనాటి కేసీఆర్‌ చేనేత కార్మికుల కోసం బిక్షాటన చేశారు. ఈనాటి కేసీఆర్‌ మన మనిషి కాదు.. మర మనిషి. ఆ సార్‌ ఇప్పుడు రారు.. ఎందుకంటే ఆయన మరమనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్‌ బందీ అయ్యారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సరిగా పాలించలేదు. అందుకే సరైన ఫలితాలు రాలేదు. 

హైడ్రా పేదల ఇళ్లు కూలగొడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. ఉద్యమకారుల్ని ఇబ్బంది పెడుతుంటే కేసీఆర్‌ ఆనాడు ఎందుకు స్పందించలేదు. కేసీఆర్‌ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదు. దీనిపై ఆనాడే నేను పోరాడాల్సి ఉండేది. అదే నా తప్పైంది. ఆనాడు ఉద్యమకారులకు జరిగిందే ఇవాళ నాకు జరిగింది.

కేసీఆర్‌ మారుతారామోనని చూశా కానీ నన్నే సస్పెండ్‌ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే నేను చెప్పడమే తప్పా. తప్పు చేయని నన్ను పార్టీ నుంచి పంపించేశారు.  అవినీతి పందికొక్కులను మాత్రం కేసీఆర్‌ పక్కన పెట్టుకున్నారు. ఆయన మారిపోయారు కాబట్టే నేను యుద్ధం మొదలుపెట్టా. ఇది ఆరంభం మాత్రమే ముందుంది ముసళ్ల పండుగ అంటూ కవిత కేసీఆర్ ను డైరెక్ట్ గానే మేడ్చల్ సభ సాక్షిగా టార్గెట్ చేసారు.

Kavitha targets KCR:

Kavitha floats Telangana Rashtra Sena targets KCR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs