Advertisement
Google Ads BL

అడివి శేష్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ


విలన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన హీరో అడివి శేష్ ఆతర్వాత ప్రత్యేకమైన సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. క్షణం, ఎవరు, గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి చిత్రాలతో ఆడియన్స్ మదిలో తనదైన ముద్ర వేసిన అడివి శేష్ రీసెంట్ గా డెకాయిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అడివి శేష్ అటు సినిమా విషయాలు, ఇటు వ్యక్తిగత విషయాలను రివీల్ చేసాడు.

Advertisement
CJ Advs

అందులో భాగంగా అడివి శేష్ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ని బయటపెట్టాడు. సినిమాల్లోకి రాకముందు అడివి శేష్ అమెరికాలో ఉండేవాడనే విషయం అందరికి తెలిసిందే. అక్కడే 17 ఏళ్ళ వయసులో అడివి శేష్ ప్రేమలో పడ్డాడట. కానీ లవ్ చేసాక చాలా బాధపడ్డాను అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

యుఎస్ లో ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడ్డాను.. కానీ రెండు ప్రేమ కథలు నాకు విషాదాన్నే మిగిల్చాయి. నా బర్త్ డే రోజే నేను ప్రేమించిన అమ్మాయి మరోకరిని పెళ్లి చేసుకుంది. అది చూసి నేను భరించలేకపోయాను. ప్రతి పుట్టినరోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే.. నాకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడమే గుర్తుకు వస్తుంది. 

నిజంగా ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇక మరొక లవ్ స్టోరీ లో నేను ప్రేమించిన అమ్మాయి అనుకోకుండా మరణించడం నన్ను ఎంతగానో కుంగదీసింది.. అంటూ అడివి శేష్ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ని బయటపెట్టాడు. 

Adivi Sesh Failure Love Story:

Adivi Sesh Opens Up About His Love Failure
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs