Advertisement
Google Ads BL

కవిత కొత్త పార్టీ పేరుతొ కేసీఆర్ కు షాక్


కేసీఆర్ కుమార్తె గా పాలిటిక్స్ లోకి వచ్చి రాజకీయాలు నేర్చి ఇప్పుడు తండ్రినే తలదన్నే నేతగా ఎదగాలనే కసితో కొత్త పార్టీ కి శ్రీకారం చుట్టుంది కవిత. తండ్రి, అన్న కు ఎదురెళ్లి తెలంగాణలో కొత్త పార్టీ జెండా ఎగరేసింది. కల్వకుంట్ల కవిత ఈరోజు శనివారం కొత్త పార్టీ ప్రకటించింది. తన పార్టీకి టీఆర్‌ఎస్‌(తెలంగాణ రాష్ట్ర సేన)గా ఆమె నామకరణం చేసి తండ్రి కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

Advertisement
CJ Advs

టీఆర్‌ఎస్‌ పేరుతొ తెలంగాణ రాష్ట్రాన్ని విడదీసి పదేళ్లు పాలించిన కేసీఆర్ ఆతర్వాత టీఆర్‌ఎస్‌ ను బీఆర్ఎస్ గా మార్చేసారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరు ని బీఆర్ఎస్ గా మార్చిన కెసిఆర్ కు కన్న కూతురు కవిత తన కొత్త పార్టీ ని టీఆర్‌ఎస్‌ అంటూ అనౌన్స్ చేసి షాకివ్వడం హాట్ టాపిక్ అయ్యింది . 

శనివారం మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభ వేదికగా కవిత కొత్త పార్టీ ప్రకటన వెలువడింది. పార్టీ ప్రకటన అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించా. నాకు సింగరేణి అంటే చాలా ఇష్టం. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదే. బతుకమ్మతో తెలంగాణ సంస్కృతిని చాటాం. బతుకమ్మను ప్రపంచానికి పునఃపరిచయం చేసుకున్నాం. 

సామాజిక తెలంగాణ రథచక్రం ఎక్కడో విరిగి ముక్కలైంది. తెలంగాణ ఆనాడు పాలించిన కుటుంబంలో నేను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నా. ఆనాడు ఇసుక మాఫియా ఎన్నో దారుణాలకు పాల్పడింది.  అలాగే తెలంగాణ సాధించిన కుటుంబంలో ఉన్నందుకు మాత్రం గర్వపడుతున్నా అంటూ ఆవేశంగా మాట్లాడింది.

అంతేకాదు ఈ ఓపెనింగ్ సభలో తండ్రి కేసీఆర్ ను కవిత పలుమార్లు విమర్శించడం, కాంగ్రెస్, బీజేపీ లపై విరుచుకుపడడం అన్నీ హైలెట్ అవ్వగా కవిత కు సపోర్ట్ గా వచ్చిన  కార్యాకర్తలు, అభిమానులు కవిత ను సీఎం సీఎం అంటూ అరవడంతో కవిత ఒకింత గర్వంగా ఫీలయ్యింది.

Kavitha new party details out:

Details about Kavitha new party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs