మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి మెగా 158 చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలవ్వబోతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మోహన్ లాల్ కీలక పాత్రలో బాబీ కొల్లి- చిరు సినిమాలో నటిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు డింపుల్ హయతి నెగెటివ్ రోల్ ప్లే చేస్తుంది అనే న్యూస్ ప్రచారంలో ఉంది.
ఇక నందమూరి బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో నయన్ ప్లేస్ లోకి కాజల్ వచ్చింది. మరో హీరోయిన్ గా డింపుల్ పేరు వినిపిస్తుంది. ఇక బాలయ్య-వివేక్ ఆత్రేయ మూవీలో మోహన్ లాల్ నటిస్తారనే ప్రచారం ఉంది. అటు మోహన్ లాల్, ఇటు డింపుల్ హయతి పేరు ఒకేసారి రెండు సీనియర్ హీరోల సినిమాల్లో వినిపిస్తున్నాయి.
చిరు, బాలయ్య సినిమాల్లో మోహన్ లాల్ నటిస్తారా లేదా అనేది అనుమానమే అయినా.. డింపుల్ హయతి పేరు మాత్రం చిరు, బాలయ్య ఇద్దరి సినిమాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఫైనల్ గా ఏ హీరో సరసన కనిపిస్తుందో చూడాలి.