Advertisement
Google Ads BL

అందుకే నయనతారను తప్పించారా


లేడీ సూపర్ స్టార్ నయనతార తో సినిమా అంటే మాములు విషయం కాదు. కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తుంది. పారితోషికం ఓకే అన్నా ప్రమోషన్స్ కు రాను అంటుంది. స్టార్ హీరోల కున్న క్రేజ్ ఆమెకు ఉంది, కాబట్టే డిమాండ్ చేస్తుంది. అందులోను నయనతార ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్ళింది. ఆమె రేంజ్ మరింత పెరుగుతుంది. కాదు పెంచేసింది.

Advertisement
CJ Advs

రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు హిట్ తర్వాత నయనతారకు బాలయ్య తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నయనతార బాలయ్య తో రొమాన్స్ చెయ్యాల్సి ఉంది. కానీ నయనతార భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. అది కూడా దాదాపుగా రూ.10 కోట్లు అడగడంతో మేకర్స్ నయన్ ను లైట్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.

పది కోట్లు అయినా సర్దుకుపోదామనుకున్నా ఆమె ఎలాగూ ప్రమోషన్స్ కు రాదు, అలాగే ఈమధ్యన డేట్స్ విషయంలో నయనతార కండిషన్స్ పెట్టడంతో NBK 111 మేకర్స్ నయన్ ను తప్పించి ఆ ప్లేస్ లోకి కాజల్ ని తీసుకున్నారనే విషయం ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. 

కాజల్ తో సమస్య లేదు. పెద్దగా పారితోషికం అడగదు, కావల్సినన్ని ప్రమోషన్స్ చేస్తుంది. అడిగినన్ని డేట్స్ ఇస్తుంది అని నయన్ ప్లేస్ లో కాజల్ ని ఎంపిక చేసారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది అని, ఆమె ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Nayanthara Demands Massive Pay Hike for NBK 111:

Nayanthara
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs