దీపికా పదుకొనె సెకండ్ ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేయడంతోనే సినిమాల విషయంలో రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి. దానితో ముందుగా ఆమె నటిస్తున్న రాకా టీమ్ రియాక్ట్ అయ్యింది. అలాంటి ఊహాగానాలు నమ్మొద్దు, దీపికా పదుకొనే రాకా లో భాగమే, ఆమె పాత్ర నిడివి కూడా తగ్గించలేదు, యాక్షన్ సీక్వెన్స్ కూడా నిపుణుల పర్యవేక్షణలోనే చిత్రీకరిస్తామని చెప్పారు.
దీపికా పదుకొనే షారుఖ్ కింగ్ చిత్రంలోను నటిస్తుంది. తాజాగా జరుగుతోన్న కింగ్ షూటింగ్ షెడ్యూల్ లో దీపికా పై దర్శకుడు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీపికా ప్రెగ్నెంట్, సో ఆమెపై చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలు తగ్గిస్తారనుకున్నారు కానీ దీపికా మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటుంది.
షారుఖ్ కింగ్ కోసం ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఈ యాక్షన్ సీక్వెన్ ని చిత్రీకరిస్తున్నారని.. త్వరలోనే 8 మందితో కూడిన ఫైట్ సన్నివేశాన్ని కూడా దర్శకుడు సిద్ధార్థ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. షారుక్, దీపిక ఇద్దరూ కలిసి ఈ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొంటారని బాలీవుడ్ మీడియా కథనం ప్రసారం చేసింది.