Advertisement
Google Ads BL

బీజేపీ లోకి మల్లారెడ్డి కోడలు


ఈమధ్యన తరచూ వార్తల్లో హైలెట్ అవుతున్న పేరు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డిది. డాక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రీతి రెడ్డి డాన్స్ విషయంలోనూ, మామగారు షష్టిపూర్తి వేడుకల్లోనే కాదు పలు వస్త్ర దుకాణాల ఓపెనింగ్స్, ఇంకా టెంపుల్స్ కి వెళ్లడం ఇలా ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్న ప్రీతి రెడ్డి త్వరలోనే రాజకీయ అరంగేట్రం చెయ్యబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

తాజాగా ప్రీతి రెడ్డి హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ కి వెళ్లి అక్కడ బీజేపీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ప్రధాని మోడీని బీజేపీ ని తెగ పొగిడిన ప్రీతి రెడ్డి చంద్రశేఖర్ తివారితో భేటీ అవడం వెనుక ఆమె బీజేపీలో చేరుతుంది అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆమె మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు. మరి కోడలు బీజేపీలో ఏమైనా చేరుతుందా..

బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో మల్లారెడ్డి బిజినెస్ లు చాలావరకు దెబ్బతిన్నాయి. బిజినెస్ కి వస్తున్న సమస్యల దృష్ట్యా ప్రీతి రెడ్డి అడుగులు బీజేపీ వైపు వేస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అదే ఆమెను అడిగితె తను బీజేపీ లో చేరడం లేదు అంటూ సింపుల్ గా తప్పించుకుంది. అంతేకాదు మల్లారెడ్డి విద్యాసంస్థలు గూగుల్ కలిపి ఏర్పాటు చెయ్యబోతున్న డిజిటల్ - AI ఏజెన్సీ క్యాంపస్ ఓపెనింగ్ కార్యక్రమానికి ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ నేతలను ఆహ్వానిస్తున్నాము.

తాను అందుకే బీజేపీ నేతలను కలిసినట్టుగా చెప్పిన ప్రీతి రెడ్డి తనకు బీఆర్ఎస్ పై ప్రత్యేకమైన గౌరవం ఉంది అన్నారు. కానీ వరసగా బీజేపీ నేతలను కలవడం, రెండు రోజుల క్రితం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ప్రీతిరెడ్డి భేటీ అవడం ఇవన్నీ ఆమె బీజేపీ లోకి వెళ్లబోతుంది అనడానికి సంకేతాలు గా చెబుతున్నారు.

Malla Reddy daughter in law Preethi To Join BJP:

Malla Reddy daughter in law Preeti Reddy visits Hyderabad bjp office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs