Advertisement
Google Ads BL

బంగారమే ఆదుకోవాలి


టాప్ హీరోయిన్ సమంత స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయ్యింది. అల్లు అర్జున్ తో పుష్ప 1 లో చేసిన స్పెషల్ తర్వాత సమంత కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. ఆతర్వాత ఆమె చేసిన సినిమాలన్ని నిరాశపరిచాయని చెప్పలేం కానీ అంత సూపర్ హిట్టు కూడా అవ్వలేదు. 

Advertisement
CJ Advs

అటు హెల్త్ రీజన్స్, ఇటు సెకండ్ మ్యారేజ్ తర్వాత సమంత చేసిన చిత్రం మా ఇంటి బంగారం. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత భర్త రాజ్ నిడిమోరు పర్యవేక్షణలో సమంత మెయిన్ లీడ్ చేసిన మా ఇంటి బంగారం చిత్రం మే 15 న విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం డల్ గా ఉన్న బాక్సాఫీసుని మా ఇంటి బంగారమే ఆదుకోవాలి.

అంతే కాదు అటు సమంత కెరీర్ ని డిసైడ్ చేసేది కూడా మా ఇంటి బంగారమే. మే 15 న పెద్దగా పోటీ లేకుండా దిగుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలున్నాయి. సమంత స్వయంగా తన చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. సినిమా కూడా బాగా వచ్చింది అనే టాక్ ఉంది. ఇప్పటికే సమంత హుక్ స్టెప్ సాంగ్ వైరల్ అవుతోంది.

సమంత కు మా ఇంటి బంగారం కమ్ బ్యాక్ మూవీ అవ్వాల్సిందే అని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. చూద్దాం సమంత కు మా ఇంటి బంగారం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అనేది.

Samantha Maa Inti Bangaram:

Maa Inti Bangaram release on may 15th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs