తమిళనాట అసెంబ్లీ ఎలెక్షన్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసాయి. ఏప్రిల్ 23 గురువారం తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో ప్రస్తుతం అధిరంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం మరోసారి అధికారం కోసం ఎదురు చూస్తుంది. ఏఐడీఎంకే ఈసారి అధికారాన్ని చేపట్టాలని ప్రచారం చేసింది. మరోపక్క ఈ ఎలక్షన్స్ లో హీరో విజయ్ పార్టీ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
విజయ్ తన అభిమానులు అండ చూసుకునే రాజకీయాల్లోకి దిగాడు. సినిమాల్లో తనకున్న అభిమాన గణం తనని పాలిటిక్స్ లో గెలిపిస్తారనే నమ్మకంతో విజయ్ ఉన్నాడు. ఇక ఈరోజు జరిగిన పోలింగ్ లో చెన్నై వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోవడమే కాదు, తమిళనాడు వ్యాప్తంగా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి.
అయితే విజయ్ కి వీరాభిమాని అయిన ఓ మహిళా ఓటర్ విజయ్ కి సారీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ మహిళ అభిమాని ఒకరు మలేషియా నుంచి విజయ్ కి ఓటు వేసేందుకు ఎయిర్ పోర్ట్ కి రాగా.. ఆప్పటికే ఫ్లైట్ టైమ్ అయిపొయింది. దానితో ఫ్లైట్ మిస్ అయ్యి విజయ్ కి ఓటు వెయ్యలేకపోతున్నందుకు ఆ మహిళా అభిమాని ఎంతగా ఎమోషనల్ అయ్యిందో మాటల్లో చెప్పనలవి కాదు.
అయినప్పటికి ఆమె పట్టు వదలకుండా మరో ఫ్లైట్ పట్టుకుని తమిళనాడుకు చేరుకోవడం హైలెట్ అయ్యింది. ఈ ప్రయాణంలో ఆ మహిళా అభిమాని ఇది కేవలం ఎన్నికలు కాదు.. ఇది ఒక ఎమోషన్ అంటూ సోషల్ మీడియా లో ట్వీట్ చెయ్యడం చూసి విజయ్ కోసం నిలబడిన అభిమానుల సపోర్ట్ మామూలుది కాదు అంటున్నారు.